అది గతం, ఇప్పుడు గెలవాల్సిన వరల్డ్‌కప్ గురించి ఆలోచించండి... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Apr 2, 2021, 10:34 AM IST

2011 వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకుని నేటికి పదేళ్లు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో సీనియర్లు సెహ్వాగ్, సచిన్ త్వరగా అవుటైన తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించిన గంభీర్, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు...

‘నాకు ఓ విషయం ఎప్పుడూ అర్థం కాదు. జనాలు ఎందుకు, ఎప్పుడూ అయిపోయిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. 1983లో కానీ, 2011లో కానీ వరల్డ్‌కప్ గెలవడం అందరికీ గర్వకారణం. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటే గర్వంగా ఉంటుంది...
undefined
అయితే ఆవన్నీ ఇప్పుడు గతం... పదేళ్ల క్రితం 2011లో వరల్డ్‌కప్ గెలిచాం. కానీ ఆ తర్వాత 2015, 2019లో గెలవలేకపోయాం. ఆ రెండు వరల్డ్‌కప్‌లు గెలిచి ఉంటే, క్రికెట్ ప్రపంచంలో టీమిండియా ఓ సూపర్ పవర్‌గా ఉండేది...
undefined
కానీ అలా జరగలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే టీ20 వరల్డ్‌కప్ గురించి, 2022 వరల్డ్‌కప్ గురించి ఆలోచించండి. వరల్డ్‌కప్ గెలవడానికి ఎలా తయారవ్వాలో, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలో ఆలోచించండి...ముఖ్యంగా జట్టును తయారుచేయండి..
undefined
2011 వరల్డ్‌కప్‌లో కూడా భారత జట్టు చాలామందిప్లేయర్లను ప్రయోగించింది. ప్రతీ స్థానానికి ముగ్గురు, నలుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉండేవాళ్లు. ఎంత ఎక్కువమంది ప్లేయర్లను ఉపయోగిస్తే, అన్ని ఎక్కువ ఆప్షన్లు తయారవుతాయి...
undefined
అందులో బెస్ట్ ఎలెవన్ ప్లేయర్లను ఆడిస్తే, ఎలాంటి జట్టునైనా ఓడించొచ్చు... నాకు ఓపెనింగ్ చేయడం అంటే ఇష్టం. లేదు నేను నాలుగో స్థానంలో లేదా ఐదో స్థానంలో ఆడతానంటే ఇప్పుడు కుదరదు...
undefined
జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉండాలి... 2011లో ఇలాగే చేశాం. వరల్డ్‌కప్ గెలవడానికి ఏం చేయకూడదో, వాటి జోలికి మేం వెళ్లలేదు...
undefined
వరల్డ్‌కప్ కోసం జట్టును ఎంపిక చేసినప్పుడు, దాన్ని గెలవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది... చాలామంది నిన్నే అయిపోయినట్టు ఉంది అంటారు. నాకు మాత్రం 10 ఏళ్లు గడిచిపోయినట్టు తెలుస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
undefined
శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, సెంచరీ ముగింట అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు...
undefined
సెంచరీ ముగింట అవుట్ కావడానికి మహేంద్ర సింగ్ ధోనీ, తనకి సెంచరీ దగ్గరికొచ్చావు? అని గుర్తు చేయడమే అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు గౌతమ్ గంభీర్...
undefined
2011 వరల్డ్‌కప్ విజయంలో కీలక భూమిక పోషించింది గౌతమ్ గంభీర్ అయినా, ఆఖర్లో సిక్సర్ బాదిన మహేంద్ర సింగ్ ధోనీకే ఎక్కువ క్రెడిట్ దక్కిందనే కారణంగానే గౌతీ ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...
undefined
click me!