ఈ ఫిట్‌నెస్ టెస్టు ఉంటే... సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కూడా ఆడేవాళ్లు కాదు... వీరూ ఫైర్!

Published : Apr 02, 2021, 10:05 AM IST

ఆస్ట్రేలియా టూర్‌లో అరడజనుకు పైగా ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో సరికొత్త ఫిట్‌నెస్ టెస్టుకి అమలులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. భారత జట్టు తరుపున ఆడాలంటే పేసర్ అయితే 8 నిమిషాల 15 సెకన్లలో, మిగిలిన ప్లేయర్లు మరో 15 సెకన్లు ఎక్కువగా తీసుకుని 2 కి.మీ దూరాన్ని పరుగెత్తాల్సి ఉంటుంది. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

PREV
110
ఈ ఫిట్‌నెస్ టెస్టు ఉంటే... సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కూడా ఆడేవాళ్లు కాదు... వీరూ ఫైర్!

బీసీసీఐ అమలులోకి తెచ్చిన కొత్త ఫిట్‌నెస్ టెస్టు కారణంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియా వంటి ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు...

210

ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, ఆసీస్ టూర్‌కి ఎంపికైనా గాయం కారణంగా ఆడలేకపోయాడు.

310

భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచేందుకు బీసీసీఐ, 2018లోనే యోయో టెస్టును అమలులోకి తీసుకొచ్చింది. ఈ టెస్టు పాస్ అయితే చాలు, టీమిండియాలో చోటు దక్కించుకునేవాళ్లు. 

410

అలాగే ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత 2 కి.మీ.ల ఫిట్‌నెస్ టెస్టును తప్పనిసరి చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత మాజీ ఓపెనర్, ‘వీరబాదుడు’ వీరేంద్ర సెహ్వాగ్...

510

‘ఆటగాళ్ల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు... మంచి ఫిట్‌నెస్ ఉన్న శరీరమా... లేక మంచి పర్ఫామెన్స్ ఆ... పర్ఫామెన్స్ బాగున్నప్పుడు ఇంక ఫిట్‌నెస్ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి?...

610

ఇలాంటి కఠినమైన ఫిట్‌నెస్ టెస్టులు అమలులో ఉండి ఉంటే... నాతో పాటు సచిన్ టెండూల్కర్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా జట్టులో అవకాశం దక్కించుకునేవాళ్లు కాదు...

710

ముందు ఆటగాళ్ల ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. ఆ తర్వాత పర్ఫామెన్స్ స్థాయికి తగ్గట్టు లేకపోతే అప్పుడు ఫిట్‌నెస్ టెస్టు చేయండి. ఓ ఆటగాడు తన కోటా పది ఓవర్లు బౌలింగ్ చేయగలిగి, ఫీల్డింగ్ చేయగలిగితే చాలు...

810

హార్ధిక్ పాండ్యాకి ఫిట్‌నెస్ టెస్టుతో ఎలాంటి సమస్యా లేదు. మరి ఎందుకు అతను ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే అతని విషయంలో వర్క్ లోడ్ సమస్య వస్తోందని విరాట్ కోహ్లీయే ఒప్పుకున్నాడు...

910

సిక్స్ ప్యాక్ ఉన్నవాడే సిక్సర్లు ఈజీగా బాదుతాడని లేదు, కండలు తిరిగిన శరీరం ఉంటేనే బౌలింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తారని లేదు... కాబట్టి టీమిండియా ఇప్పటిదాకా ఈ విషయాన్ని గ్రహించాలి’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

1010

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో షమీ, ఉమేశ్ యాదవ్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా గాయాలపాలైన విషయం తెలిసిందే.

click me!

Recommended Stories