IPL 2023 Playoffs: ఉన్నది ఒక్క ప్లేస్.. మూడు జట్ల మధ్య పోటా పోటీ.. ఐపీఎల్‌లో నేడు సెన్సేషనల్ సండే

Published : May 21, 2023, 11:53 AM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16  లీగ్ దశ  పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సీజన్ లో నేటితో లీగ్ దశ పోటీలు ముగుస్తాయి.  

PREV
17
IPL 2023 Playoffs: ఉన్నది ఒక్క ప్లేస్.. మూడు జట్ల మధ్య పోటా పోటీ.. ఐపీఎల్‌లో నేడు సెన్సేషనల్ సండే
Image credit: Sandeep Rana

సుమారు రెండు నెలలుగా  జరుగుతున్న  ఐపీఎల్  - 16  చివరి దశకు చేరింది.  లీగ్ దశలో 68 మ్యాచ్ లు ముగిసినా ఇప్పటికీ  ప్లేఆఫ్స్   సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  నేడు నాలుగు జట్లు తలపడబోయే ఆఖరి డబుల్ హెడర్ లో  ఒక జట్టు   ప్లేఆఫ్స్ లో పోటీపడే ఫోర్త్ ప్లేస్ ను  దక్కించుకుంటుంది. 

27
Image credit: PTI

ఇప్పటికే  గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్,  లక్నో సూపర్ జెయింట్స్  లు ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవగా  నేడు నాలుగో   స్థానానికి  రసవత్తర పోరు జరుగనుంది.  ఈ మేరకు  ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో పాటు రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీలో ఉన్నాయి. 

37

ముందుగా ముంబై ఇండియన్స్ -  సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య  వాంఖెడే వేదికగా   మధ్యాహ్నం 3.30 గంటలకు  ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది.   సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఏదో మ్యాచ్ గెలిచామా అంటే గెలిచాం అన్నట్టు గెలిస్తే ముంబైకి మొదటికే మోసం.  సన్ రైజర్స్ పై  కనీసం 80 పరుగుల తేడాతో  ఓడించాలి.  అప్పుడే ఆ జట్టు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. 

47

ముంబై  ప్లేఆఫ్స్  కు వెళ్లడం  ఆ జట్టుతో  పాటు గుజరాత్ - ఆర్సీబీ మ్యాచ్ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది.   బెంగళూరు వేదికగా  నేటి రాత్రి  7.30 గంటలకు జరుగబోయే మ్యాచ్ లో ఆర్సీబీ ఓడితే అప్పుడు ముంబై  ప్లేఆఫ్స్ కు వెళ్తుంది.  వర్షం కారణంగా  మ్యాచ్ రద్దైనా  అది కూడా బెంగళూరుకు  కష్టమే.. 

57

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో   నాలుగో స్థానంలో ఉన్న  ఆర్సీబీ..  14 పాయింట్లతో ఉంది.  ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కు కూడా ఇన్నే పాయింట్లున్నాయి.  కానీ నెట్ రన్ రేట్ విషయంలో  బెంగళూరుకు కాస్త ఎడ్జ్ ఉంది.  బెంగళూరు నెట్ రన్ రేట్ +0.180 ఉండగా  రాజస్తాన్ కు +0.148, ముంబైకి     -0.128 ఉంది. 

67

ఒకవేళ ముంబై  ఓడితే మిగతా ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుంది.  ముంబై  భారీ విజయం కాకున్నా నార్మల్ విక్టరీ అందుకున్నా ఆ జట్టుకు 16 పాయింట్లు వస్తాయి.  అప్పుడు ఆర్సీబీ మాత్రం  గుజరాత్ ను తప్పకుండా  ఓడించాలి. 

77

ఇక రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే.. గుజరాత్ బెంగళూరును భారీ తేడాతో  ఓడించి,  హైదరాబాద్ కూడా ముంబైని ఓడిస్తే  అప్పుడు మెరుగైన రన్ రేట్ ఆధారంగా  రాజస్తాన్ ప్లేఆఫ్స్ లో ఎంట్రీ ఇవ్వొచ్చు. మరి  నేటి సూపర్ సెన్సేషనల్ సండేకు సిద్ధం కండి.. !

click me!

Recommended Stories