టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు లభిస్తుంది. ఇందులో రూ.1.10 లక్షల కన్స్యూమర్ ఆఫర్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ ఉన్నాయి. మీడియం రేంజ్ వేరియంట్‌పై రూ.1.25 లక్షలు, స్మార్ట్ ట్రిమ్‌పై రూ.95,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
అటు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పాత మోడల్ ఎల్‌ఆర్ ఎక్స్‌టీ వేరియంట్‌పై రూ.70,000 కన్స్యూమర్ ఆఫర్, రూ.50,000 ఫ్రీడమ్ ఆఫర్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌తో కలిపి మొత్తం రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. టియాగో ఈవీ ఎల్‌ఆర్ ఎక్స్‌జెడ్+ పై రూ.1.25 లక్షలు, మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.