మీరు ఏ వేరియంట్ ఎంచుకోవాలో గందరగోళంగా ఉంటే, ZXi వేరియంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వాల్యూ ఫర్ మనీ. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి డైలీ యూజ్ ఫీచర్లన్నీ ఇందులో లభిస్తాయి. పైగా ఇది పెట్రోల్, ఆటోమేటిక్, సీఎన్జీ మూడింటిలోనూ అందుబాటులో ఉంది.
మీకు లగ్జరీ ఫీచర్లు, 10.1-ఇంచ్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు కావాలనుకుంటే ZXi+ కి వెళ్లవచ్చు. తక్కువ బడ్జెట్‌లో సేఫ్టీ, పవర్ కావాలనుకునే వారికి LXi, VXi కూడా మంచి ఎంపికలే. టాటా నెక్షాన్, హ్యుందాయ్ వేన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి మోడళ్లకు ఈ 2026 బ్రెజ్జా గట్టి పోటీ ఇస్తోంది.