Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?

Published : Apr 10, 2026, 11:48 AM IST

Tata: టాటా మోటార్స్‌కు గత ఆర్థిక సంవత్సరంలో మంచి అమ్మకాలు తీసుకొచ్చిన కార్లలో టాటా నెక్సాన్ ఒక‌టి. గత ఆర్థిక సంవత్సరంలో 1,63,088 యూనిట్లు అమ్ముడవగా, FY26లో అది 2,16,054 యూనిట్లకు పెరిగింది. ఇది ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. 

PREV
14
టాటా నెక్సాన్ ఫీచ‌ర్లు

టాటా నెక్సాన్ రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ సామర్థ్యం 1199cc నుంచి 1497cc వరకు ఉంది. పవర్ 99 bhp నుంచి 118.27 bhp వరకు ఉంటుంది. టార్క్ విష‌యానికొస్తే 170 Nm నుంచి 260 Nm వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 208 mm, సీటింగ్ సామర్థ్యం 5 మంది, డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ SUVలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి. సిటీ డ్రైవ్‌లో మంచి టార్క్ ఇస్తూ, హైవేపై 100–120 కిమీ వేగంతో సాఫీగా ప్రయాణించేందుకు ఈ కార్ అనుకూలంగా ఉంటుంది. సిటీ డ్రైవ్‌లో సాధారణంగా 11–13 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

24
ఆకర్షణీయమైన డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీ

2017లో మొదటిసారి మార్కెట్‌లోకి వచ్చిన టాటా నెక్సాన్ ప్రతి ఏడాది చిన్న చిన్న మార్పులతో మరింత మెరుగుపడుతూ వచ్చింది. 2023లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్, టెక్నాలజీ పరంగా పెద్ద మార్పులు చేశారు. కొత్త మోడల్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, స్టైలిష్ DRLs, కొత్త లైటింగ్ సిగ్నేచర్, 16 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. కారు వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. లాక్/అన్‌లాక్ సమయంలో వచ్చే లైట్ యానిమేషన్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ కారును ప్రిస్టంన్ వైట్‌, రాయ‌ల్ బ్లూ, Daytona గ్రే, గ్రాస్‌లాండ్ బీజ్‌, ప్యూర్ గ్రే, ఓష‌న్ బ్లూ వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. అలాగే డార్క్ ఎడిష‌న్‌, రెడ్ డార్క్ ఎడిష‌న్ కూడా ఉన్నాయి.

34
ఇంటీరియర్, ఫీచర్లు

నెక్సాన్ ఇంటీరియర్‌ను ఆధునికంగా తీర్చిదిద్దారు. డాష్‌బోర్డ్‌లో మినిమలిస్టిక్ డిజైన్, ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ కారును ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. అలాగే 9 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ / పానోరామిక్ సన్‌రూఫ్ (వేరియంట్ ఆధారంగా) ఇంటీరియర్‌లో లెదరెట్ సీట్లు, సాఫ్ట్ టచ్ మెటీరియల్ వాడటం వల్ల కారు లోపల ప్రీమియం ఫీల్ వస్తుంది.

44
భద్రత, ధర వివరాలు

టాటా నెక్సాన్ భద్రత విషయంలో కూడా మంచి గుర్తింపు పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS తో EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, 3 పాయింట్ సీట్ బెల్ట్స్‌తో పాటు ఇటీవల టాటా కంపెనీ Level-1 ADAS ఫీచర్లను కూడా జోడించింది. అంతేకాదు, Global NCAP, Bharat NCAP పరీక్షల్లో నెక్సాన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది భారత మార్కెట్‌లో అత్యంత సురక్షిత SUVలలో ఒకటిగా నిలిచింది. ధ‌ర విష‌యానికొస్ఏ టాటా నెక్సాన్ ధర రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.15 లక్షల వరకు ఉంటుంది. మొత్తం 61 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories