Maruti Suzuki : మారుతి సుజుకి బిగ్ ప్లాన్: 2026లో రాబోతున్న 4 అదిరిపోయే కొత్త కార్లు ఇవే!

Published : Dec 23, 2025, 03:14 PM IST

Maruti Suzuki New Cars : మారుతి సుజుకి 2026లో ఈ విటారా, ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్, కొత్త ఎలక్ట్రిక్ MPV, బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌లను విడుదల చేయనుంది. ఈ కొత్త కార్ల ఫీచర్లు, బ్యాటరీ, ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? 2026లో మారుతి నుంచి రానున్న ఈ 4 మోడల్స్ చూడాల్సిందే.

భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), 2026 సంవత్సరంలో కొత్త ఉత్పత్తులతో అదరగొట్టడానికి సిద్ధంగా ఉంది. భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే దిశగా, కంపెనీ వచ్చే ఏడాది నాలుగు సరికొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. 2025లో కేవలం విక్టోరిస్ (Victoris) అనే ఒక్క కొత్త కారును మాత్రమే పరిచయం చేసిన మారుతి సుజుకి, 2026లో మాత్రం దూకుడు పెంచనుంది.

వచ్చే ఏడాది కంపెనీ ప్రణాళికల్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles), ఒక ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ (Flex-fuel model), ఎంతో ప్రజాదరణ పొందిన బ్రెజా కాంపాక్ట్ SUV అప్డేటెడ్ వెర్షన్ ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించడం, ఇప్పటికే ఉన్న మోడళ్లను అప్డేట్ చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకోవాలని మారుతి సుజుకి భావిస్తోంది.

ఈ ప్రణాళికలో భాగంగా ఈ విటారా (e Vitara) ఎలక్ట్రిక్ SUV, ఫ్రాంక్స్ (Fronx) ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్, YMC కోడ్‌నేమ్‌తో పిలువబడే ఆల్-ఎలక్ట్రిక్ MPV, ఫేస్‌లిఫ్టెడ్ బ్రెజా (Brezza) మోడల్స్ ఉన్నాయి. పలు మీడియా, లీక్ రిపోర్టుల ప్రకారం..  వీటి గురించిన పూర్తి వివరాలు గమనిస్తే..

25
మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki e Vitara)

మారుతి సుజుకి నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ విటారా (e Vitara) 2026 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అవి ఒకటి 49kWh బ్యాటరీ ప్యాక్, రెండోది 61kWh బ్యాటరీ ప్యాక్.

ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు కూడా ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయనుంది. మారుతి సుజుకి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 543 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ (Driving Range) ఇస్తుంది. భద్రత విషయంలో కూడా ఈ కారు అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంది. భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

ఈ ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ SUV మార్కెట్లో మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, విన్‌ఫాస్ట్ VF6, టాటా కర్వ్ EV వంటి మోడళ్లతో పోటీపడనుంది.

35
ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్

పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు మారుతి సుజుకి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, 2026 ద్వితీయార్థంలో కంపెనీ తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Fronx Flex Fuel) ఇంజిన్‌ను పరిచయం చేయనుంది. ఈ ఇంజిన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx) కాంపాక్ట్ SUVలో ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్ E85 బ్లెండ్‌ల వరకు సపోర్ట్ చేస్తుందని అంచనా. E85 బ్లెండ్ అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. కొత్త ఇంజిన్ మినహా, ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు డిజైన్, ఫీచర్ల పరంగా ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వెర్షన్‌తో సమానంగానే ఉండే అవకాశం ఉంది.

45
YMC కోడ్‌నేమ్‌తో ఎలక్ట్రిక్ MPV

2026లో మారుతి సుజుకి నుంచి రానున్న రెండవ ఎలక్ట్రిక్ వాహనం ఒక ఆల్-ఎలక్ట్రిక్ MPV (Electric MPV Codenamed YMC). దీనికి ప్రస్తుతం YMC అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇది 2026 సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ YMC మోడల్ కూడా ఈ విటారా (e Vitara) ఆధారపడిన ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మితం కానుంది. కానీ ఇది MPV బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ MPVలో కూడా ఈ విటారాలో ఉపయోగించిన 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌లనే ఉపయోగించే అవకాశం ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్ సుమారు 500 నుంచి 550 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చని అంచనా.

55
బ్రెజా ఫేస్‌లిఫ్ట్

భారతదేశంలో ఎంతో ఆదరణ పొందిన బ్రెజా కాంపాక్ట్ SUVకి కూడా మారుతి సుజుకి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రెజా ఫేస్‌లిఫ్ట్ (Brezza Facelift) 2026 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు లభించిన స్పై ఇమేజెస్ ప్రకారం, ఇందులో చిన్నపాటి డిజైన్ అప్‌డేట్స్ ఉండవచ్చు. అలాగే ఇంటీరియర్‌లో కొన్ని మార్పులు, అదనపు ఫీచర్లను ఆశించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories