Swivel Seat: ఎంత కాస్లీ కారు అయినా సరే వృద్ధులు, దివ్యాంగులు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటారు. కచ్చింగా ఒకరి సహాయం ఉండాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతి కీలక నిర్ణయం తీసుకుంది.
కారు ఎక్కడం, దిగడం వృద్ధులకు చాలాసార్లు కష్టంగా మారుతుంది. నాన్నమ్మ–తాతయ్యలు కారు సీట్లో కూర్చోవాలంటే పక్కవారి సహాయం తీసుకోవాల్సిందే అని తెలిసిందే. అయితే ఈ సమస్యను గుర్తించిన మారుతీ సుజుకి, తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగనార్‌లో Swivel Seat అనే ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీటు వల్ల వృద్ధులు, దివ్యాంగులు చాలా సులభంగా కారులో కూర్చోవచ్చు.
25
Swivel Seat అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
Swivel Seat ప్రత్యేకత ఏంటంటే, కారు తలుపు తెరిచిన వెంటనే సీటు బయట వైపు తిరుగుతుంది. దీంతో కూర్చోవడం, లేవడం చాలా ఈజీ అవుతుంది. సీటు తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత మళ్లీ సాధారణ సీటులాగే లాక్ అవుతుంది. ముఖ్యంగా ఈ సీటు కోసం కారు బాడీ లేదా మెకానికల్ భాగాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ సీటును పూర్తిగా తొలగించకుండా, దానిపైనే ఈ సదుపాయాన్ని అమర్చవచ్చు.
35
సీటు అమర్చడానికి ఎంత సమయం పడుతుంది?
మారుతీ సుజుకి అధికారిక సమాచారం ప్రకారం, Swivel Seat అమరికకు సుమారు ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. ఎలాంటి క్లిష్టమైన మార్పులు అవసరం ఉండవు. పూర్తిగా సేఫ్‌గా, కంపెనీ సూచనల ప్రకారమే అమర్చుతారు. కొత్త WagonR కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే 2019 తర్వాత విక్రయించిన WagonR కార్లలో కూడా ఈ సీటును అమర్చించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వేరియంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా 11 నగరాల్లో ప్రారంభించారు. 200కు పైగా ఏరియా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. వినియోగదారుల స్పందనను బట్టి మిగతా నగరాలు, రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ Swivel Seat కోసం మారుతీ సుజుకి, బెంగళూరుకు చెందిన TRUEAssist Technology Private Limitedతో ఒప్పందం చేసుకుంది. ఈ సీటుకు 3 సంవత్సరాల మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వారంటీ కూడా ఇస్తున్నారు.
55
వినియోగదారుల అవసరాలపై కంపెనీల దృష్టి
వృద్ధులు, దివ్యాంగుల కోసం WagonRలో Swivel Seat అందించడం మారుతీ సుజుకి తీసుకున్న మంచి అడుగు. ఇదే తరహాలో టాటా మోటార్స్ కూడా సిఎన్‌జీ కార్లలో డిక్కీ సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు సిఎన్‌జీ ఉన్నా కూడా ఫుల్ డిక్కీ సౌకర్యం ఇస్తోంది. యూజర్ల సమస్యలపై దృష్టి పెట్టడం వల్లే భారత ఆటో మార్కెట్‌లో కొత్త కొత్త ఉపయోగకరమైన ఫీచర్లు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.