Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు

Published : Oct 04, 2026, 06:22 PM IST

Maruti Suzuki festive offers: మారుతి సుజుకి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 2026 పండుగ సీజన్ సందర్భంగా మారుతి సుజుకి నెక్సా, అరేనా కార్లపై ₹1.36 లక్షల వరకు బంపర్ ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు ప్రకటించింది.

PREV
16
దసరా ధమాకా ఆఫర్లు.. మారుతి సుజుకి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు

పండుగ సీజన్ వచ్చేసింది. కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా మంచి టైమ్. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం అక్టోబర్ 2026కి సంబంధించి భారీ పండుగ ఆఫర్లను అనౌన్స్ చేసింది. తమ పాపులర్ అరేనా (Arena), నెక్సా (Nexa) షోరూమ్ మోడళ్లపై ఏకంగా ₹1.36 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌‌లు, స్క్రాపేజ్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ రివార్డులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి.

26
అరేనా షోరూమ్ కార్లపై రూ. 1.36 లక్షల వరకు సేవింగ్స్

అరేనా లైనప్‌లో కొత్తగా వచ్చిన మారుతి విక్టోరిస్ (Maruti Victoris) మోడల్‌పై అత్యధికంగా ₹1.36 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. బేస్ వేరియంట్ ప్రారంభ ధర ₹10,49,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీనిపై ₹20,000 క్యాష్ డిస్కౌంట్, అక్టోబర్ 10 లోపు బుక్ చేసుకుని అక్టోబర్ 20 లోపు డెలివరీ తీసుకుంటే లభించే ₹11,000 అదనపు క్యాష్ డిస్కౌంట్ ఉన్నాయి. దీంతో పాటు ₹50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా ₹45,000 స్క్రాపేజ్ బోనస్, ₹25,000 స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాన్, ₹30,000 వరకు లాయల్టీ బోనస్, ₹15,000 విలువైన ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ ఆఫర్ లభిస్తాయి.

36
మిగిలిన అరేనా మోడళ్ల ఆఫర్లు

• మారుతి ఎస్-ప్రెస్సో: ప్రారంభ ధర ₹3,49,900. దీనిపై ₹37,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ₹10,000 క్యాష్ డిస్కౌంట్, ₹15,000 ఎక్స్ఛేంజ్ లేదా ₹10,000 స్క్రాపేజ్ బోనస్, ₹10,000 స్మార్ట్ ఎక్స్ఛేంజ్, ₹2,500 ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ ఆఫర్ ఉన్నాయి.

• మారుతి ఆల్టో కే10: ప్రారంభ ధర ₹3,69,900. ఆఫర్లు ₹59,600 వరకు ఉన్నాయి. ఇందులో ₹30,000 క్యాష్ డిస్కౌంట్, ప్రీ-నవరాత్రి బుకింగ్ ఆఫర్ కింద ₹7,100 అదనపు డిస్కౌంట్ ఉన్నాయి.

• మారుతి సెలెరియో: ప్రారంభ ధర ₹4,69,900. ఆఫర్లు ₹54,600 వరకు లభిస్తాయి. ఇందులో ₹20,000 క్యాష్ డిస్కౌంట్, ₹7,100 అదనపు బుకింగ్ డిస్కౌంట్ ఉన్నాయి.

• మారుతి వేగన్ ఆర్ : ప్రారంభ ధర ₹4,98,900. దీనిపై ₹64,600 వరకు సేవింగ్స్ పొందే ఛాన్స్ ఉంది. ఇందులో ₹35,000 క్యాష్ డిస్కౌంట్ కలిపి ఉంది.

• మారుతి ఈకో: ప్రారంభ ధర ₹5,28,400 (ఎంట్రీ వెర్షన్ రూ. 8,90,000 గా కూడా ఉంది). దీనిపై ₹49,600 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

• మారుతి స్విఫ్ట్: ప్రారంభ ధర ₹5,83,900. ఆఫర్లు ₹50,100 వరకు లభిస్తాయి. ఇందులో ₹15,000 క్యాష్ డిస్కౌంట్, ₹5,100 ప్రీ-నవరాత్రి ఆఫర్లు ఉన్నాయి.

• మారుతి బ్రెజ్జా: ప్రారంభ ధర ₹7,49,900. దీనికి ₹5,000 ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది.

• మారుతి డిజైర్, ఎర్టిగా: డిజైర్ (రూ. 6,30,600), ఎర్టిగా (రూ. 8,90,000) మోడళ్ల ఆఫర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

• కమర్షియల్ షోరూమ్ మోడళ్లు: కమర్షియల్ వాహనాలపై దాదాపు ₹72,100 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

46
నెక్సా ప్రీమియం కార్లపై పండుగ ఆఫర్లు

నెక్సా (Nexa) షోరూమ్ శ్రేణిలో డెల్లీ-ఎన్‌సీఆర్ సహా పలు రీజియన్లలో అక్టోబర్ 1 నుంచి ఆఫర్లు అమలులోకి వచ్చాయి.

• గ్రాండ్ విటారా: సిగ్మా పెట్రోల్ ఎంటి వేరియంట్‌పై అత్యధికంగా ₹1.36 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. డెల్టా పెట్రోల్ వేరియంట్‌పై ₹1.26 లక్షలు, జీటా, ఆల్ఫా వేరియంట్‌లపై ₹1.15 లక్షల ప్రయోజనంతో పాటు 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తుంది. ఆల్ విల్ డ్రైవ్ వేరియంట్‌కు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

• హైబ్రిడ్, సీఎన్‌జీ: స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై ₹1.20 లక్షల వరకు ఆఫర్, 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీతో పాటు నిబంధనలకు లోబడి ₹1.85 లక్షల వరకు రోడ్ టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. గ్రాండ్ విటారా డెల్టా సీఎన్‌జీపై ₹1 లక్ష, జీటా సీఎన్‌జీపై ₹90,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.

56
ప్రాంక్స్, ఎక్స్ఎల్6, జిమ్నీ ఆఫర్ల వివరాలు

• మారుతి ప్రాంక్స్: టర్బో-పెట్రోల్ వర్షన్‌పై ₹27,100 వరకు, 1.2 లీటర్ పెట్రోల్ వర్షన్‌పై ₹22,100 వరకు, జీఎన్‌జీ మోడల్‌పై ₹15,000 వరకు తగ్గింపు ఉంది.

• మారుతి ఎక్స్ఎల్6: పెట్రోల్ వేరియంట్‌లపై ₹61,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్‌పై ₹50,000 వరకు ఆఫర్లు లభిస్తాయి.

• మారుతి ఇన్‌విక్టో : అన్ని వేరియంట్‌లపై ₹95,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

• మారుతి జిమ్నీ: అన్ని వేరియంట్‌లపై నేరుగా ₹35,000 ప్రయోజనం లభిస్తుంది.

• ఈ విటారా : ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారా అన్ని వేరియంట్లకు ఉచిత ఛార్జర్, హోమ్ ఇన్‌స్టాలేషన్ ఆఫర్ అందిస్తున్నారు.

66
ప్రీ-నవరాత్రి బుకింగ్స్, నియమ నిబంధనలు ఇవే

కంపెనీ తెలిపిన ఈ గరిష్ఠ తగ్గింపులు అన్నీ నేరుగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఉండవు. ఇవి కన్జ్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ల కలయికతో ఉంటాయి. ఉదాహరణకు, గ్రాండ్ విటారా సిగ్మా మోడల్‌పై ₹35,000 కన్జ్యూమర్ ఆఫర్, ₹30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి.

కస్టమర్లు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లలో ఏదో ఒకదాన్ని మాత్రమే క్లెయిమ్ చేయగలరు. పాత మారుతి సుజుకి కార్లను అప్‌గ్రేడ్ చేసుకునే వారికి లాయల్టీ బోనస్ వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రీ-నవరాత్రి ప్రత్యేక బుకింగ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు, కచ్చితమైన ప్రాంతీయ ధరల కొరకు సమీపంలోని అరేనా లేదా నెక్సా షోరూమ్‌ను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories