Sunroof Car: పాత కారుకు స‌న్‌రూఫ్ పెట్టుకోవ‌చ్చా.? ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?

Published : Apr 05, 2026, 12:42 PM IST

Sunroof Car: ప్ర‌స్తుతం సన్‌రూఫ్ మోడళ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముందు ఈ ఫీచర్ ఎక్కువగా ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న SUVలు, మిడ్‌రేంజ్ కార్లలో కూడా సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. అయితే పాత కార్ల‌లో స‌న్‌రూఫ్ పెట్టించుకోవ‌చ్చా.

PREV
15
పాత కారులో సన్‌రూఫ్ పెట్టించవచ్చా?

మీ కారులో కంపెనీ నుంచి సన్‌రూఫ్ లేకపోయినా ఆఫ్టర్ మార్కెట్‌లో (After Market) సన్‌రూఫ్ పెట్టించుకోవచ్చు. అంటే కేవలం ఈ ఫీచర్ కోసం కొత్త కారు కొనాల్సిన అవసరం ఉండదు. కార్ యాక్సెసరీస్ షాపుల్లో ప్రత్యేకంగా సన్‌రూఫ్ ఇన్‌స్టాలేషన్ సదుపాయం ఉంటుంది. ఇందులో కార్ పైకప్పును కొంచెం కట్ చేసి, అందులో సన్‌రూఫ్ అమర్చుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో మాన్యువల్, ఎలక్ట్రిక్, పానోరమిక్ వంటి పలు రకాల సన్‌రూఫ్‌లు కూడా లభిస్తున్నాయి.

25
సన్‌రూఫ్ పెట్టించడానికి ఎంత ఖర్చవుతుంది?

ఆఫ్టర్ మార్కెట్‌లో సన్‌రూఫ్ ధర దాని క్వాలిటీ, ఫీచర్లు మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బేసిక్ సన్‌రూఫ్ సుమారు రూ. 20,000 నుంచి రూ. 22,000 వ‌ర‌కు ఉంటుంది. మంచి క్వాలిటీ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అయితే రూ. 40 వేల నంఉచి రూ. 80 వేల మ‌ధ్య ఉంటుంది. పానోరమిక్ లేదా ప్రీమియం సన్‌రూఫ్ ధ‌ర రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇన్‌స్టాలేషన్ చేసే షాప్, బ్రాండ్ ఆధారంగా ఈ ధరల్లో మార్పు ఉండవచ్చు.

35
ఆఫ్టర్ మార్కెట్ సన్‌రూఫ్ వల్ల స‌మ‌స్య‌లుంటాయా.?

తక్కువ ఖర్చుతో సన్‌రూఫ్ పెట్టించుకోవడం సులభమే. కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. సన్‌రూఫ్ పెట్టేందుకు కార్ పైకప్పును కట్ చేయాలి. దీని వల్ల కారు నిర్మాణ బలం తగ్గే అవకాశం ఉంటుంది. ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే వర్షంలో నీరు కారులోకి రావచ్చు. కొంతకాలానికి జంగు (Rust) వచ్చే ప్రమాదం ఉంటుంది. సన్‌రూఫ్ కోసం వైరింగ్‌లో మార్పులు చేయాల్సి వస్తుంది. ఇవి కారు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

45
కారు వారంటీపై ప్రభావం

ఆఫ్టర్ మార్కెట్‌లో సన్‌రూఫ్ పెట్టించుకుంటే చాలా సందర్భాల్లో కారు కంపెనీ ఇచ్చే వారంటీ రద్దు కావచ్చు. ఎందుకంటే కారు అసలు డిజైన్‌లో మార్పులు చేసినట్లవుతుంది. అలాగే సన్‌రూఫ్‌లో ఉపయోగించే పార్ట్స్ కొంతకాలానికి సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటిని రిపేర్ చేయడానికి సమయం, అదనపు ఖర్చు కూడా అవసరం అవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, బయట నుంచి సన్‌రూఫ్ పెట్టించిన కార్లను కొంతమంది కొనుగోలుదారులు కొనడానికి ఆసక్తి చూపరు. దీంతో తర్వాత కారు అమ్మేటప్పుడు కూడా కొంత ఇబ్బంది రావచ్చు.

55
నిజంగా సన్‌రూఫ్ ఎంత ఉపయోగపడుతుంది?

భారతదేశం వంటి వేడి దేశాల్లో సన్‌రూఫ్ ప్రతి పరిస్థితిలో ఉపయోగపడదు. ఎక్కువ ఎండలో కార్ లోపల ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది. దీంతో AC పై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. బయట నుంచి దుమ్ము, శబ్దం కూడా లోపలికి రావచ్చు. మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా సన్‌రూఫ్‌కు డిమాండ్ తగ్గడం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణాలు కారుకు ప్రీమియం లుక్ వస్తుంది, కేబిన్‌లో ఎక్కువ వెలుతురు ఉంటుంది, ట్రిప్ సమయంలో డ్రైవింగ్ అనుభవం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories