Car: మీకు రూ. 50 వేల జీత‌మున్నా స‌రే.. ఈ ల‌గ్జ‌రీ కారును మీ సొంతం చేసుకోవ‌చ్చు.

Published : Oct 18, 2025, 03:24 PM IST

Car:  బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు అందిస్తుండ‌డంతో చాలా మంది కార్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. మ‌రి రూ. 50 వేలు జీతం వ‌చ్చే ఒక వ్య‌క్తి కొన‌గ‌లిగే ఒక ల‌గ్జరీ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యంత నమ్మకమైన SUV లలో ఒకటి. GST తగ్గింపు తర్వాత ఈకారు ప్రారంభ వేరియంట్ ధ‌ర రూ. 10,72,589 గా ఉంది. RTO రుసుము రూ. 1,25,335, ఇన్సూరెన్స్‌ రూ. 54,995, ఇతర ఛార్జీలు రూ. 11,525 కలిపితే, మొత్తం ఆన్-రోడ్ ధర సుమారు రూ. 12,64,444 అవుతుంది. పండుగ సీజన్‌లో డీలర్లు అందించే ఫైనాన్స్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ధ‌ర మరింత త‌గ్గుతుంది.

25
డౌన్ పేమెంట్, EMI ఆప్ష‌న్స్

ఒక‌వేళ మీరు ఈ కారును రూ. 2 ల‌క్షల డౌన్‌పేమెంట్‌తో సొంతం చేసుకోవాల‌నుకుంటే.. మిగిలిన రూ. 10,64,444 కోసం కారు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల (60 నెలల) లోన్ తీసుకుంటే, EMI సుమారు రూ. 22,616 అవుతుంది. ఇలా మీరు ఈ కారుకు మొత్తం రూ. 15,56,977 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ జీతం రూ. 50,000 నుంచి రూ. 60,000 వ‌ర‌కు జీతం ఉన్న వారు ఈ కారును సుల‌భంగా సొంతం చేసుకోవ‌చ్చు.

35
ఇంటీరియర్, ఫీచర్లు

క్రెటాలో సౌకర్యంతో పాటు టెక్నాలజీకి పెద్ద పీట వేశారు. ఈ కారులో 10.25 ఇంచెస్‌తో కూడిన‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25” డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా అంశాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360° కెమెరా, ADAS లెవల్ 2, ABS, EBD, ESP, TPMS ఉన్నాయి.

45
ఇంజన్, మైలేజ్

క్రెటా 3 ఇంజిన్ వేరియంట్‌లలో లభిస్తుంది. 1.5L నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. మైలేజ్ పరంగా 21–22 kmpl ఇవ్వగల సామర్థ్యం ఉంది, SUV విభాగంలో ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.

55
ఏ కార్ల‌కు క్రెటా పోటీనిస్తుంది..

ఈకారు.. కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, ఎంజి ఆస్టర్, నిస్సాన్ SUV లాంటి కార్ల‌కు పోటీనిస్తుంది. GST తగ్గింపుతో కియా సెల్టోస్ ధర రూ. 39,624 నుంచి రూ. 75,371 వరకు తగ్గింది. ఎక్స్-లైన్ వేరియంట్ సుమారు 3.67% చౌకగా మారింది. ఫలితంగా, క్రెటా, సెల్టోస్ రెండూ బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి వ‌చ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories