MG M9: ఇది కారా లేక విమాన‌మా.? కేఎల్ రాహుల్ కొత్త కారులో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

Published : Oct 17, 2025, 06:26 PM IST

MG M9: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ KL రాహుల్ తాజాగా MG M9 ఎలక్ట్రిక్ MPVని కొనుగోలు చేశారు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన‌ మొదటి భారతీయ క్రికెటర్ రాహుల్ కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం. 

PREV
15
MG M9 ఎలక్ట్రిక్ MPV ధర, వేరియంట్లు

భారతదేశంలో MG M9 ఒకే టాప్ వేరియంట్‌లో, అంటే ప్రెసిడెన్షియల్ లిమో వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 69.90 లక్షలు. ఈ కారు అత్యంత ప్రీమియం, విలాసవంతమైన ఎలక్ట్రిక్ MPVలలో ఒకటి. న‌టి హేమ మాలిని కూడా ఇటీవలే ఈ కారును సొంతం చేసుకున్నారు.

25
శ‌క్తివంత‌మైన మోటార్

MG M9లో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ ఇంజ‌న్ పవర్: 245 PS, టార్క్: 350 Nm అందిస్తుంది.

90 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇంకా వాహనానికి V2V (Vehicle-to-Vehicle), V2L (Vehicle-to-Load) టెక్నాలజీ ఉంటాయి. అంటే, ఇది ఇతర వాహనాలను లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఛార్జ్ చేయగలదు.

35
ల‌గ్జ‌రీ ఇంటీరియ‌ర్

MG M9 కాబిన్ అత్యంత ప్రీమియంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-టోన్ కాగ్నాక్ & బ్లాక్ ఇంటీరియర్ ఇచ్చారు. అలాగే బ్రష్డ్ అల్యూమినియం, వుడ్ ఫినిషింగ్ ఉంటుంది. కెప్టెన్ సీట్లు 16-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటితో ఈ MPV నడిచే బిజినెస్ క్లాస్ లాంజ్ లాంటి అనుభూతి ఇస్తుంది.

45
అద్భుత‌మైన ఫీచ‌ర్లు

MG M9లో సౌకర్యానికి ప్రత్యేక ఫీచ‌ర్ల‌ను అందించారు. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి..

* 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్

* 12.23-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

* 360° కెమెరా, లెవల్-2 ADAS

* వెనుక ప్రయాణీకుల డిస్‌ప్లే

* మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్

* వైర్‌లెస్ ఛార్జర్, కనెక్ట్ చేసిన టెక్నాల‌జీ

ఈ ఫీచర్లు MG M9ని 5-స్టార్ హోటల్ లాంజ్ అనుభూతి ఇచ్చే లగ్జరీ MPVగా మార్చాయి.

55
సెలబ్రిటీ, క్రికెట్ స్టార్‌లలో పెరుగుతున్న క్రేజ్

MG M9 ఇప్పుడు బాలీవుడ్, క్రికెట్ స్టార్‌లకు ఫెవ‌రేట్‌గా మారుతోంది. హేమ మాలినితో ప్రారంభమైన ట్రెండ్‌ను ఇప్పుడు కేఎల్ రాహుల్ కొన‌సాగించారు. ఈ కారును సెలబ్రిటీలు అల్ట్రా లగ్జరీ స్టేటస్ సింబల్‌గా మారుస్తున్నారు. ఈ కారు ఎలక్ట్రిక్ మాత్రమే కాక, పనితీరు, సౌకర్యం, స్టైల్ కలిపిన ప్రీమియం వాహనంగా పేరుగాంచింది.

Read more Photos on
click me!

Recommended Stories