Budget Car: నెల‌కు రూ. 7 వేల‌తో ఈ కారును మీ సొంతం చేసుకోండి.. ఫీచ‌ర్లు కూడా హై ఎండ్

Published : Oct 13, 2025, 11:49 AM IST

Budget Car: ఒక‌ప్పుడు కేవ‌లం ధ‌నిక వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన కారు క‌ల‌ను ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కూడా సొంతం చేసుకుంటున్నారు. బ్యాంకులు సుల‌భ‌మైన చెల్లింపు విధానంలో రుణాలు అందిస్తుండడం ఇది కార‌ణంగా చెప్పొచ్చు.  

PREV
15
మారుతి సెలెరియా

త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో అందుబాటులో ఉన్న బెస్ట్ కారులో మారితు సెలెరియా ఒక‌టి. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ఆన్‌రోడ్‌ ధ‌ర రూ. 5.55 ల‌క్ష‌లుగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఈ కారుకు మీరు రూ. ల‌క్ష డౌన్ పేమెంట్ పెడితే మిగ‌తా మొత్తం 9.8 శాతం వ‌డ్డీ రేటుకు రుణం ల‌భిస్తుంది. ఒక‌వేళ మీరు గ‌రిష్టంగా 7 ఏళ్లు చెల్లింపుతో లోన్ తీసుకుంటే నెల‌కు కేవ‌లం రూ. 7,505 ఈఎమ్ఐ చెల్లిస్తే స‌రిపోతుంది. ఇక ఈ కారు ఫీచ‌ర్ల‌కు సంబంధించిన వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.

25
ఇంజిన్‌, పనితీరు

మారుతీ సెలెరియోలో 1 పెట్రోల్ ఇంజిన్, 1 సిఎన్‌జి ఇంజిన్‌ వేరియంట్‌లు ఉన్నాయి. రెండింటి ఇంజిన్ కెపాసిటీ 998 సీసీ.

* ఇంజిన్ టైప్: K10C

* మాక్స్ పవర్: 67.77 bhp @ 5600 rpm

* మాక్స్ టార్క్: 91.1 Nm @ 3400 rpm

* సిలిండర్లు: 3

* గేర్‌బాక్స్: 5 స్పీడ్ AMT

* డ్రైవ్ టైప్: ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD)

ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. సిటీ మైలేజ్ సుమారు 19.02 kmpl, హైవే మైలేజ్ 20.08 kmpl, ARAI ప్రకారం మొత్తం మైలేజ్ 26 kmpl వరకు లభిస్తుంది.

35
ఫ్యూయ‌ల్ వివ‌రాలు

* ఫ్యూయల్ టైప్: పెట్రోల్ / సిఎన్‌జి

* ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ: 32 లీటర్లు

* బూట్ స్పేస్: 313 లీటర్లు

* సీటింగ్ కెపాసిటీ: 5 మంది

* లెంగ్త్: 3695 మి.మీ

* విడ్త్: 1655 మి.మీ

* వీల్‌బేస్: 2435 మి.మీ

* ఈ కారు కాంపాక్ట్ సైజులో ఉండి, నగర డ్రైవింగ్‌కి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

45
సేఫ్టీ ఫీచర్లు

* మారుతీ సెలెరియోను సేఫ్టీ పరంగా కూడా ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు.

* ఏయిర్‌బ్యాగ్స్: 6 (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్)

* ఏబీఎస్‌ (Anti-lock Braking System)

* ఈబీడీ (Electronic Brakeforce Distribution)

* సెంట్రల్ లాకింగ్, చైల్డ్ లాక్, ఆంటీ థెఫ్ట్ అలారం

* హిల్ అసిస్టు, స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ వార్నింగ్

* డోర్ అజార్ వార్నింగ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్

* ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫీచర్

ఈ ఫీచర్లు డ్రైవర్‌తో పాటు ప్రయాణికుల భద్రతకు భ‌రోసా క‌ల్పిస్తాయి.

55
ఎంటర్‌టైన్‌మెంట్‌, కనెక్టివిటీ

* సెలెరియోలో స్మార్ట్‌ టెక్‌ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది.

* టచ్‌స్క్రీన్ సైజు: 7 అంగుళాలు (స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్)

* కనెక్టివిటీ: Android Auto, Apple CarPlay

* బ్లూటూత్ కనెక్టివిటీ

* రేడియో, USB పోర్టులు, 2DIN ఆడియో సిస్టమ్

* స్పీకర్స్: ఫ్రంట్ & రియర్ (మొత్తం 4)

* వాయిస్ కమాండ్, నావిగేషన్ సపోర్ట్

* ఈ ఫీచర్లు డ్రైవింగ్‌ను స్మార్ట్‌, కంఫర్టబుల్‌గా మార్చుతాయి.

గ‌మ‌నిక‌: ఈ వివ‌రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు, లోన్ ప్రాసెస్ గురించి మీకు ద‌గ్గ‌ర‌ల్లోని షోరూమ్‌ను సంద‌ర్శించి పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories