Car Parking: ఎండలు దంచికొడుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండలు మనుషులు, జంతువులనే కాకుండా వాహనాలకు సైతం సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎండలో కారు పార్కింగ్ చేసే వారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఎండలో పార్కింగ్ చేసిన కారు ఒక హీట్ బాక్స్‌లా మారుతుంది. బయట 35°C ఉంటే, కారులో 55–65°C వరకు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వేడిలో కూర్చోవడం కష్టమే కాదు, ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఇది ప్రమాదకరం.
25
కారు రంగు మసకబారుతుంది
సూర్యుని అల్ట్రావయలెట్ కిరణాలు కారు పైన ఉన్న పెయింట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. దీంతో రంగు మెల్లగా ఫేడ్ అవుతుంది, కారు మెరుపు తగ్గుతుంది, పైన ఉన్న పెయింట్ లేయర్ దెబ్బతింటుంది. కొంతకాలానికి కారు పాతగా కనిపించడం ప్రారంభమవుతుంది.
35
ఇన్‌టీరియర్ దెబ్బతింటుంది
కారు లోపలి భాగాలు ఎక్కువగా ప్లాస్టిక్, లెదర్ లేదా ఫ్యాబ్రిక్‌తో తయారవుతాయి. వేడి వల్ల ఇవి ఇలా మారుతాయి. దీంతో డాష్‌బోర్డ్ క్రాక్ అవుతుంది, లెదర్ సీట్లు గట్టిపడి చిట్లిపోతాయి, ఫ్యాబ్రిక్ సీట్ల రంగు తగ్గుతుంది. అంతేకాకుండా లోపలి గాలి చాలా వేడిగా, ఊపిరాడని విధంగా మారుతుంది.
ఎక్కువ ఉష్ణోగ్రతలు కారులోని ముఖ్యమైన భాగాలపై కూడా ప్రభావం చూపుతాయి. బ్యాటరీలోని ద్రవం త్వరగా ఆవిరవుతుంది. ఇది బ్యాటరీ జీవిత కాలం తగ్గడానికి కారణమవుతుంది. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ పనితీరు తగ్గుతుంది. ఇవన్నింటి కారనంతో వాహనం పనితీరు దెబ్బతింటుంది. దీంతో సర్వీసింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
55
రబ్బరు పార్ట్స్ త్వరగా పాడవుతాయి
వేడి కారణంగా రబ్బరు భాగాలు గట్టిపడి పగిలిపోతాయి. వైపర్ బ్లేడ్స్, డోర్ సీల్స్, టైర్లు త్వరగా చెడిపోవడం వల్ల తరచుగా మార్చాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు కారు నీడలో పార్క్ చేయాలి. కారు కవర్ వాడితే మంచి రక్షణ ఉంటుంది. సన్‌షేడ్‌లు ఉపయోగిస్తే లోపలి వేడి తగ్గుతుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కారు లైఫ్ పెరుగుతుంది, ఖర్చులు కూడా తగ్గుతాయి.