UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?

Published : Dec 31, 2025, 01:50 PM IST

యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు అభ్యర్థి జ్ఞానాన్ని మాత్రమే కాదు వారి ఆలోచనా విధానాన్ని కూడా పరీక్షిస్తాయి. అలాంటి 5 ట్రిక్కీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
15
ప్రశ్న : మనిషి చేతిలో తయారై వారినే కంట్రోల్ చేస్తుంది... ఏమిటది?

సమాధానం: డబ్బులు. వీటిని మనిషి సృష్టిస్తాడు.. అదే వారిని నియంత్రిస్తుంది. డబ్బు అనేది మనిషి స్వభావాన్ని, ప్రాధాన్యాన్ని, నైతికతను మార్చేస్తుంది. ఈ ప్రశ్న చాలా లోతైన అర్థం కలిగినది. 

25
ప్రశ్న : అన్నీ తెెలుసు... కానీ ఎప్పుడూ ఏం మాట్లాడదు.. ఏమిటది?

సమాధానం: పుస్తకం. పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు, కానీ అవి స్వయంగా మాట్లాడలేవు. ఈ ప్రశ్న విద్య, అభ్యాసం పట్ల అభ్యర్థి దృక్పథాన్ని పరీక్షిస్తుంది.

35
ప్రశ్న : మాట్లాడితే చాలు నాశనమవుతుంది... ఏమిటది?

సమాధానం: నిశ్శబ్దం. ఇది ఒక క్లాసిక్ ట్రిక్కీ ప్రశ్న. ఎవరూ మాట్లాడనంత వరకే నిశ్శబ్దం ఉంటుంది. మాటలు రాగానే నిశ్శబ్దం వీడిపోతుంది. ఈ ప్రశ్న ద్వారా అభ్యర్థికి భాష, ప్రవర్తన, మౌనం ప్రాముఖ్యత గురించి ఎంత తెలుసో బోర్డు పరీక్షిస్తుంది.

45
ప్రశ్న : చప్పుడు చేయకుండా నిత్యం ముందుకు సాగుతుంది... ఏమిటది?

సమాధానం: ఆలోచన. ఈ ప్రశ్న అభ్యర్థి మానసిక పరిపక్వతను పరీక్షిస్తుంది. ఆలోచన ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, కానీ దానికి శబ్దం గానీ, ఆకారం గానీ ఉండదు.

55
ప్రశ్న : నిత్యం మండుతూనే ఉంటుంది.. కానీ బూడిద కూడా ఉండదు.. ఏమిటది?

సమాధానం: సూర్యకాంతి లేదా సౌరశక్తి. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఉద్దేశం సైన్స్ కంటే సైద్ధాంతిక అవగాహనను పరీక్షించడం. సూర్యకాంతి మండే ప్రక్రియలా శక్తిని విడుదల చేస్తుంది, కానీ భౌతిక వస్తువులా బూడిదను మిగల్చదు.

Read more Photos on
click me!

Recommended Stories