IAS Success Story : ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుని ముందుకుసాగిన సివిల్స్ ర్యాంకర్స్ స్టోరీ ఇది. ఒకటి రెండు కాదు 5, 6వ ప్రయత్నంలో UPSC పరీక్షలో విజయం సాధించిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల ఆసక్తికర, స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకోండి.
IAS Success Story : UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్).. దేశంలోనే అత్యున్నత సర్వీసెస్ IAS, IPS, IFS వంటి ఉద్యోగాలను భర్తీ చేసే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ. ఇది నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE) దేశంలోనే అత్యంత కఠినమైనది. ఏటా లక్షల మంది యువతీయువకులు సివిల్స్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు… కానీ కొందరే విజయం సాధిస్తారు.
చాలామందికి మొదటి ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఎదురవుతుంది… దీంతో నిరాశతో వెనుదిరుగుతుంటారు. కొందరు మాత్రం అపజయాలను సోపానాలుగా మార్చుకుని విజయం దిశగా ప్రయాణం సాగిస్తారు… పదేపదే పడినా కిందపడినా లేచి నిలబడతారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు అనేక అపజయాలు ఎదరైనా వెనుదిరగకుండా 5, 6వ ప్రయత్నంలో IAS అయినవారు చాలామంది ఉన్నారు.. అలాంటి అధికారుల గురించి తెలుసుకోండి. ఈ స్పూర్తితో మీరు కూడా పదేపదే వైఫల్యాలు ఎదురైనా మరింత పట్టుదలతో ప్రయత్నించి సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించగలరు.
26
శక్తి దూబే... 6వ ప్రయత్నంలో ఆలిండియా టాపర్
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే UPSC 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు… అయితే ఇది ఆమెకు ఆరో ప్రయత్నం. ఆమె మొదట్లో విఫలమైనా పట్టు వదల్లేదు… కోవిడ్ వల్ల కోచింగ్ వదిలి ఇంటి నుంచే సెల్ఫ్ స్టడీ చేశారు. ఆమె కథ పదేపదే విఫలమై తమను తాము తక్కువ చేసుకుని ఆత్మస్థైర్యం కోల్పోయే విద్యార్థులకు ఒక పాఠం.
36
అవనీష్ శరణ్ IAS ... ఆలిండియా 77వ ర్యాంక్
తక్కువ మార్కులను బలహీనతగా భావించేవారికి అవనీష్ శరణ్ కథ స్ఫూర్తి. 10వ తరగతిలో 44%, 12వ తరగతిలో 65% మార్కులు సాధించినా, పట్టుదలతో రెండో ప్రయత్నంలో UPSCలో 77వ ర్యాంక్ సాధించారు. ఆయన 10 సార్లు స్టేట్ PCSలో ఫెయిల్ అయ్యారు.
ప్రియాంక గోయల్ UPSC ప్రయాణం కష్టాలతో నిండింది. ఆమె నాలుగుసార్లు విఫలమయ్యారు. అనేక సమస్యలు చుట్టుముట్టినా ఆమె పట్టు వదల్లేదు… తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెకు సేవలు చేస్తూనే ప్రిపేర్ అయ్యింది. చివరకు 2022 లో ఐదో ప్రయత్నంలో ఆలిండియా 369వ ర్యాంక్ సాధించారు.
56
యశని నాగరాజన్ IAS
ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ వదిలేయాలనుకునే వారికి యశని నాగరాజన్ ఆదర్శం. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ రోజుకు 4-5 గంటలు చదివి, నాలుగో ప్రయత్నంలో UPSC 2019లో 57వ ర్యాంక్ సాధించారు. టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం అని ఆమె నమ్మకం.
66
పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ IAS.. నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంక్
పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ UPSC CSE 2023లో ఆల్ ఇండియా 4వ ర్యాంక్ సాధించారు. ఇది ఆయన నాలుగో ప్రయత్నం. 2022లో 121వ ర్యాంక్‌తో IPSకు ఎంపికై శిక్షణలో ఉండగానే, 2023 ఫలితాలు వచ్చాయి. ఆయన మళ్ళీ పరీక్ష రాసిన విషయం కుటుంబానికి కూడా తెలియదు. ఇలా ఓవైపు శిక్షణలో ఉంటూనే పరీక్ష రాసి తన కలల సర్వీస్ IAS సాధించారు.