Success Story : టెన్త్ లో ఫెయిలయ్యాడు... కానీ మూడుసార్లు సివిల్స్ పాసై ఐపిఎస్ అయ్యాడు.. ఇదికదా సక్సెస్ అంటే..

Published : Sep 22, 2025, 08:48 PM IST

Success Story : పదో తరగతి ఫెయిలైన ఓ బాలుడు పట్టుదలతో చదివి ఐపిఎస్ స్థాయికి ఎదిగాడు. ఇతడి సక్సెస్ చాలామందికి స్పూర్తినిస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వరకు అతడి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. 

PREV
15
ఇతడిది కదా విజయమంటే...

Success Story : పది, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు చూస్తుంటాం... ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుంటారు. ఉద్యోగం రాలేదని కొందరు, బిజినెస్ చేసి నష్టపోయి మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఫెయిల్యూర్ అంటే ఓటమిగా భావించేవారే ఎక్కువమంది ఉంటారు... కానీ దీన్ని తమ విజయానికి మెట్టుగా మలచుకోవాలని భావించేవారు చాలా తక్కువమంది ఉంటారు. తమ ఫెయిల్యూర్స్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించి లూజర్ అన్నవాళ్లతోనే విన్నర్ అనిపించుకోవడంలో మామూలు కిక్ ఉండదు. ఇది తెలియక చాలామంది జీవితాన్ని చాలిస్తున్నారు. కానీ అపజయం తర్వాత సాధించే విజయం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇలాంటి విజయమే సాధించాడో పల్లెటూరి కుర్రాడు.

పదో తరగతి ఫెయిలైతే జీవితంలో ఏం చేయలేరని సమాజం భావిస్తుంది. ఇలా టెన్త్ లో ఫెయిల్ అయిన ఓ బాలుడు మాత్రం జీవితంలో పాస్ అయ్యాడు... ఏకంగా దేశంలోనే అత్యంత కఠినమమైన యూపిఎస్సి పరీక్షలో పాసయ్యాడు. అదీ ఒకటి రెండు సార్లు ఏకంగా మూడుసార్లు సివిల్స్ ర్యాంకు సాధించి అనుకున్న ఐపిఎస్ కలను సాాకారం చేసుకున్నాడు. ఇలా ఒకప్పుడు టెన్త్ ఫెయిల్ అయ్యాడని చులకనగా చూసి అవమానించినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు... ఇది కదా సక్సెస్ అంటూ పొగిడించుకున్నారు. ఆయనే ఈశ్వర్ గుర్జర్ IPS.ఇలా టెన్త్ ఫెయిల్ నుండి సివిల్స్ ర్యాంకు వరకు అతడి ప్రయాణం గురించి తెలుసుకుందాం.

25
ఎవరీ ఈశ్వర్ గుర్జర్?

భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్ష యూపిఎస్సి (Union Public Service Commissio) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఐఏఎస్, ఐపిఎస్ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడానికి మంచి చదువు మాత్రమే కాదు, బలమైన సంకల్పం, నిరంతర కృషి, ఓర్పు కూడా అవసరం. ఇలా రాజస్థాన్‌కు చెందిన సివిల్స్ ర్యాంకర్ ఈశ్వర్ గుర్జర్ కథ చాలా స్ఫూర్తిదాయకమైనది. ఈశ్వర్ ప్రస్థానం సాధారణంగానే మొదలైంది... 10వ తరగతిలో ఫెయిల్ అవ్వడం అతనికి పెద్ద ఎదురుదెబ్బ. కానీ ఓటమిని అంగీకరించకుండా తనను తాను ప్రోత్సహించుకుని యూపిఎస్సి స్థాయికి ఎదిగారు.

ఈశ్వర్ లాల్ గుర్జర్ రాజస్థాన్‌లోని భిల్వారాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి సువాలాల్ గుర్జర్ కిరాణా దుకాణం నడిపేవారు... తల్లి సుఖీ దేవి గృహిణి. చదువులో ఎప్పుడూ యావరేజ్‌గా ఉండే ఈశ్వర్ 10వ తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఈ వైఫల్యంతో అతను చాలా నిరాశ చెందాడు... చదువు మానేయాలని కూడా అనుకున్నాడు. కానీ అతని తండ్రి ధైర్యం చెప్పాడు... ఆశ కోల్పోవద్దని ప్రోత్సహించారు. ఇలా తండ్రి ప్రోత్సాహం ఈశ్వర్ లాల్ గుర్జర్ జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి.

35
ఈశ్వర్ గుర్జర్ సెకండ్ ఇన్నింగ్స్

ఈశ్వర్ తన తండ్రి మాటలను మనసులో పెట్టుకుని 2012లో 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ మళ్లీ రాశారు... ఈసారి 54% మార్కులతో పాస్ అయ్యాడు. ఆ తర్వాత 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ లో 68% మార్కులు సాధించాడు. ఎండిఎస్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

ఇలా చదువు పూర్తిచేసాక ఈశ్వర్ లాల్ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్దమయ్యాడు. కష్టపడి చదివిన అతడు 2019లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఏ టెన్షల్ లేని ఉద్యోగం, మంచి సాలరీ... ఈశ్వర్ లైఫ్ సెట్ అయ్యింది.

45
ఈశ్వర్ గుర్జర్ యూపిఎస్సి ప్రయాణం

అయితే ఈశ్వర్ ఆశయం కేవలం ఉపాధ్యాయుడిగా మిగిలిపోవడం కాదు... అంతకంటే మంచి ఉద్యోగం సాధించడం. ఇందుకోసం అతడు అత్యంత కఠినమైన యూపిఎస్సిని ఎంచుకున్నాడు. ఇలా టీచర్ గా పనిచేస్తూనే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు... 2019లో మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదు. ఆ తర్వాత పట్టుదలతో చదివి 2020లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు... కానీ ఫైనల్ లిస్ట్‌లో చోటు దక్కలేదు. 2021లో మరో ప్రయత్నం విఫలమయ్యాడు.

ఇలా ఫెయిల్యూర్స్ ను విజయాలుగా మలచుకోవడం ఎలాగో ఈశ్వర్ కు బాగా తెలుసు. అందుకే వరుస ఈ వైఫల్యాలు ఎదురైనా పట్టు వదల్లేదు. నిరంతర కృషి, ఏకాగ్రతతో 2022లో నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు... యూపిఎస్సి లో ఆలిండియా 644 ర్యాంకు సాధించాడు. దీంతో ఐఆర్ఎస్ కేడర్ వచ్చింది. తర్వాత 2023లో మరోసారి ప్రయత్నించి ఆలిండియా 555 సాధించి ఐపిఎస్ కావాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈశ్వర్ అంతటితో ఆగలేదు.. 2024లో మూడోసారి యూపిఎస్సి పాసై ఆలిండియా 483 సాధించాడు.

55
ఈశ్వర్ గుర్జర్ ఐపిఎస్ స్ఫూర్తిదాయక సందేశం

యూపిఎస్సి 2024 ఫలితాల తర్వాత ఈశ్వర్ ఐపిఎస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు - "మాటలు అవే, కేవలం సంవత్సరం, సమయం మారాయి. యూపిఎస్సి సిఎస్సి 2024 ఫలితం వచ్చింది. 483 ర్యాంక్ సాధించాను. ఐఆర్ఎస్ నుండి ఐపిఎస్ గా మారారు... చాలా గర్వంగా ఉంది, ఈ విజయం ఇచ్చే సంతృప్తి అమూల్యమైనది" అని అన్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జర్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు. అతని కథ కఠోర శ్రమ, ఓర్పు, పట్టుదలతో ఎవరైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories