ఊహ‌కంద‌ని విధ్వంసం.. ఏఐ కార‌ణంతో 2035 నాటికి ఎంత‌మంది ఉద్యోగాలు కోల్పోనున్నారో తెలుసా.?

Published : May 21, 2026, 04:21 PM IST

Layoffs: కృత్రిమ మేథ‌స్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దీంతో వేలాది ఉద్యోగాలు పోతున్నాయి. తాజాగా యూకేకు చెందిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (NFER) విడుదల చేసిన రిపోర్ట్‌లో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

PREV
15
ఏఐతో ఉద్యోగాల‌పై పెరుగుతోన్న ముప్పు

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనేక పనులను యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌లు వేగంగానే కాకుండా.. తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా ప‌దే ప‌దే చేసే పనులు, డేటా ఆధారిత కార్యకలాపాలు, సాధారణ కార్యాలయ విధులను AI సులభంగా నిర్వహించగలుగుతోంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల కంటే ఆటోమేషన్‌పై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

25
ఏ ఉద్యోగాలకు ఎక్కువ ప్రమాదం?

NFER రిపోర్ట్ ప్రకారం ఫ్యాక్టరీ కార్మికులు, యంత్రాల ఆపరేటర్లు, పరిపాలనా సహాయకులు (అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు), గిడ్డంగి ఉద్యోగులు, క్యాషియర్లు వంటి ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ పనులను ఆటోమేటెడ్ యంత్రాలు, రోబోట్లు, AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు, రూఫింగ్ వంటి కొన్ని సాంకేతిక రంగాల్లో కూడా రోబోటిక్స్ వినియోగం పెరగవచ్చని రిపోర్ట్ పేర్కొంది.

35
భవిష్యత్తులో ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి?

అన్ని ఉద్యోగాలను AI భర్తీ చేయలేదని ఈ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. సృజనాత్మకత, భావోద్వేగ అవగాహన, మానవ సంబంధాలు, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరమైన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కొనసాగుతాయి. ముఖ్యంగా న్యాయవాదులు, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఉపాధ్యాయులు, మానసిక వైద్యులు, కౌన్సిలర్లు వంటి వృత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రంగాల్లో కూడా AI సహకారంతో పని చేసే విధానం మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

45
అమెరికాలో కూడా ఇదే పరిస్థితి

బ్రిటన్ మాత్రమే కాదు, అమెరికాలో కూడా AI ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. తాజాగా విడుదలైన MIT రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని సుమారు 12 శాతం ఉద్యోగాలను AI భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్, ఆరోగ్య సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ వెల్లడించింది. ఈ రంగాల్లో డేటా విశ్లేషణ, రిపోర్టింగ్, సాధారణ నిర్ణయ ప్రక్రియలను AI వేగంగా నిర్వహించగలదని పేర్కొంది.

55
మారుతున్న కాలానికి నైపుణ్యాలే కీలకం

AI ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత అవసరం. డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, AI వినియోగం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారు భవిష్యత్తులో కూడా ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు. AI కొన్ని ఉద్యోగాలను తగ్గించినప్పటికీ, కొత్త రకాల ఉద్యోగాలకు కూడా మార్గం సుగమం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories