ఈ నెల నుంచి మీకు శాలరీ డబ్బులు తక్కువగా రావచ్చు. టేక్ హోమ్ శాలరీ తగ్గితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… మీ శాలరీ ఏ మాత్రం తగ్గదు.. కటింగ్స్ పెరుగుతాయంతే. ఇలా ఎందుకో తెలుసా..?
ఉద్యోగాలు చేస్తూ నెలనెలా వచ్చే శాలరీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వేతనజీవులు ఈ నెల శాలరీ చూసి కంగారుపడిపోకండి. శాలరీ తక్కువగా వచ్చిందని హెచ్ఆర్ ను సంప్రదించడమో.. ఉన్నత ఉద్యోగులకు ఫిర్యాదు చేయడమో చేయకండి. ఎందుకంటే కొత్త లేబర్ కోడ్ కారణంగా టేక్ హోమ్ శాలరీ కాస్త తగ్గవచ్చు.
కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి వాటిలో మార్పులు ఉంటాయి. మే 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దీనివల్ల మీ నెలవారీ జీతంలో మార్పులు రావచ్చు.
25
అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు..
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేసిన సవరణలతో ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోనుంది. ముఖ్యంగా బేసిక్ శాలరీలో పెద్ద మార్పు వస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ (Basic salary) అతని మొత్తం జీతంలో (CTC) 50 శాతం ఉండాలి. చాలా కంపెనీలు బేసిక్ సాలరీ తక్కువగా ఇచ్చి, అలవెన్సులు ఎక్కువగా చూపిస్తుంటాయి. కానీ ఇక కొత్త రూల్స్ ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదు.
ఉదాహరణకు మీ CTC రూ.50,000 అయితే కొత్త రూల్ప్ ప్రకారం బేసిక్ శాలరీ తప్పకుండా రూ.25,000 ఉండాలి. దీనివల్ల మీ పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. ఇది ఉద్యోగి భవిష్యత్ అవసరాలకు ఆర్థికంగా భరోసా ఇస్తుంది.
35
ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గింపు..
కొత్త లేబర్ చట్టాల మార్పు వల్ల ఉద్యోగుల చేతికొచ్చే జీతం (టేక్ హోమ్ శాలరీ) తగ్గుతుంది. ఎందుకంటే జీతంలో పీఎఫ్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. నెలనెలా జీతం తగ్గినా, భవిష్యత్తులో ఇది మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒకేసారి పీఎఫ్ రూపంలో భారీ డబ్బులు పొందవచ్చు.
కొత్త లేబర్ కోడ్‌లో పని గంటలు, సెలవుల వంటి విషయాల్లో కూడా నియమాలను సులభతరం చేశారు. కంపెనీలు వారానికి 5 రోజుల పని, 2 రోజులు సెలవు లేదా 4 రోజుల పని, 3 రోజులు సెలవు ఇచ్చే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే వారంలో మొత్తం పని గంటలు 48 గంటలకు మించకూడదు.
55
ఉద్యోగులకు లాభం... కంపెనీలకు భారం
ఈ కొత్త రూల్స్ వల్ల కంపెనీలు ఉద్యోగుల కోసం కేటాయించే CTC మొత్తాన్ని పెంచాల్సి రావచ్చు. ఉద్యోగి, కంపెనీ చెల్లించే పీఎఫ్ మొత్తం పెరుగుతుంది కాబట్టి ఇది కంపెనీలకు భారంగా మారొచ్చు. కానీ చాలా కంపెనీలు ఈ భారాన్ని కూడా మొత్తం CTCలో కలిపి సర్దుబాటు చేసే అవకాశం ఉంది.