Bank Jobs : తెలుగులోనే పరీక్ష... తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగం, సాలరీ ఎంతో తెలుసా?

Published : Jul 21, 2025, 03:07 PM IST

దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. హ్యాపీగా తెలుగులోనే పరీక్షరాసి మంచి సాలరీతో తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. ఖాళీలెన్నో తెలుసా? 

PREV
18
భారీ బ్యాంక్ జాబ్స్...

Bank Jobs : ఉద్యోగల కోసం సన్నద్దమవుతున్న నిరుద్యోగ యువతకు బ్యాంకింగ్ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రతిఏటా వేలాది ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి... కొన్ని బ్యాంకులు సొంతంగా రిక్రూట్ మెంట్ చేపడితే మరికొన్ని IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ద్వారా చేపడతాయి.

ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఐబిపిఎస్ ద్వారానే జరుగుతుంది. వివిధ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల నుండి ప్రొబెషనరీ (PO), క్లర్క్, ఇతర ఉద్యోగాల నియామకం కోసం పరీక్షలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. తాజాగా భారీ ఉద్యోగాల భర్తీకి ఐబిఎస్ నోటిఫికేషన్ వెలువడింది.

28
ఈ బ్యాంకుల్లోనే ఉద్యోగాల భర్తీ

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

2. కెనరా బ్యాంక్

3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

4. యూకో (UCO) బ్యాంక్

5. బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

7. పంజాబ్ నేషనల్ బ్యాంక్

8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

9. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

10. ఇండియన్ బ్యాంక్

11. పంజాబ్ ఆండ్ సింధ్ బ్యాంక్

38
అర్హతలు

పైన పేర్కొన్న బ్యాంకుల్లో క్లరికల్ లేదా ఆ స్థాయి ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ (CRP Clerks-XIV) చేపట్టింది IBPS. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ఇండియన్ సిటిజన్ అయివుండాలి.

2. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వుండాలి. లేదంటే డిగ్రీకి సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి.

3. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్కూల్ లేదా కాలేజ్ లేదా ఏదైనా ఇన్ట్సిట్యూట్ లో కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకుని ఉండాలి.

4. జులై 21 అంటే దరఖాస్తుల చివరితేదీ వరకు అభ్యర్థుల వద్ద అన్ని అర్హతా సర్టిఫికెట్స్ ఉండాాలి. ఉద్యోగాల్లో జాయినింగ్ సమయంలో వీటిని సమర్పించాల్సి ఉంటుంది.

5. అభ్యర్థి క్రెడిట్ హిస్టరీ బాగుండాలి.

48
వయోపరిమితి

కనిష్టంగా 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు వయసుండాలి. అంటే 02-07-1996 కు ముందు, 01-07-2004 తర్వాత పుట్టినవారు అనర్హులు.

ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్, వితంతు మహిళలకు కూడా వయసు సడలింపు ఉంటుంది.

58
దరఖాస్తు విధానం, ఫీజు

అధికారిక వెబ్ సైట్ www.ibps.in ఓపెన్ చేసి హోంపేజీలో 'CRP Clerks' పై క్లిక్ చేయండి. అక్కడ 'Click Here to Apply Online For CRP-Clerk' పై క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిల్ చేసి, ఆన్ లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించి ప్రాసెస్ పూర్తిచేయాలి.

దరఖాస్తు సమయంలో ఎస్సి, ఎస్టి అభ్యర్థులు రూ.175 ఫీజు ఆన్ లైన్ చెల్లించాలి. ఇతర కేటగిరిల అభ్యర్థులు మాత్రం రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

68
పరీక్షా విధానం

1. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్)

మొత్తం 100 మార్కులు - 60 నిమిషాల సమయం

ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు

న్యూమరికల్ ఎబిలిటి - 35 ప్రశ్నలు - 35 మార్కులు

రీజనింగ్ - 35 ప్రశ్నలు - 35 మార్కులు

2. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్)

ప్రిలిమినరీలో క్వాలిఫై అయినవారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఇది 200 మార్కుల పరీక్ష... 160 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

జనరల్/ఫైనాన్షియల్ అవగాహన - 50 ప్రశ్నలు - 50 మార్కులు

జనరల్ ఇంగ్లీష్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు

రీజనింగ్ ఎబిలిటి ఆండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 60 మార్కులు

క్వాలిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

మొత్తం 190 ప్రశ్నలను 160 నిమిషాల సమయంలో పూర్తిచేయాలి.

78
తెలంగాణ, ఏపీలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారు?

ఈ IBPS పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక బాషల్లోనూ ఉంటుంది. అంటే ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులు తెలుగులో… తెలంగాణ అభ్యర్థులు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ బ్యాంకుల్లో మొత్తం 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్సి 19, ఎస్టి 11, ఓబిసి 24, ఈడబ్ల్యూఎస్ 8, జనరల్ 43 పోస్టులు ఉన్నాయి. మరో 19 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్సి 18, ఎస్టి 11, ఓబిసి 16, ఈడబ్ల్యూఎస్ 8, జనరల్ 51 పోస్టులు ఉన్నాయి. మరో 19 పోస్టులను మరికొన్ని కేటగిరీల్లో భర్తీ చేయనున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 5208 పోస్టులను ఈ IBPS పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

88
సాలరీ ఎంత?

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.48,000 నుండి రూ.85,000 వరకు సాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అయితే సాలరీ విషయంలో బ్యాంకులదే తుదినిర్ణయం.

Read more Photos on
click me!

Recommended Stories