బట్టీ చదువులతో ఇక బ్రతకలేం..
మనవారేమో ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ దాక రోడ్డ కొట్టుడు .. బట్టీ చదువులు !
ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ఏదైనా చెప్పేది తమకు వచ్చిన నాలుగు ముక్కలే !
CSE.. DS .. AIML .. బ్రాంచ్ పేరు ఏదైనా ఆవు వ్యాసాలే !
కాలం చెల్లిన చదువులు చెప్పి ... కాపీ లు కొట్టించి... డిగ్రీ లు ఇచ్చి బయటకే తోలేస్తే..
ఉద్యోగాలు వచ్చేయడానికి ఇదేమైనా సోఫ్త్వేర్ స్వర్ణ యుగమా?
మనం వున్నది 2025 లో.. కృతిమ మేధ యుగం మొదలై పోయింది .
ఇప్పటి దాక చదివిన బట్టీ చదువులు వేస్ట్ !
కాపీ కొట్టి తెచ్చుకొన్న డిగ్రీ లు వేస్ట్!
మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలెట్టాల్సిందే !
బట్టీ చదువుల మోడ్ లో.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్... మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్స్ లు చదివినా ఉద్యోగాలు రావు .
ఎందుకంటే బట్టీ రాయిళ్ళు ... మహా అంటే రోబో లు చేసే పనే చేయగలుగుతారు .
అదేమో వీరి కంటే లక్ష రెట్లు ఎక్కువ పని సామర్త్యం కనబరుస్తుంది.