Competitive Exam Tips : చండి పాదాల అండ.. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు మంచి మార్కులు..!

Published : Dec 22, 2025, 04:38 PM IST

Competitive Exam Tips : పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్. ఇలా స్మార్ట్ గా చదివడం అనే కాన్సెప్ట్ నుండే ‘చండి పాదాాల అండ’ అనే వాఖ్యం పుట్టింది. దీని అర్థమేంటో తెలుసా?

PREV
15
ఇలా చదివితే జాబ్ పక్కా..

ఈ కాలంలో చదువుల పేరిట విద్యార్థులపై ఒత్తిడిచేసే విద్యాసంస్థలే ఎక్కువైపోయాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా పాఠాలు చెప్పేవారు కరువైపోయారు... యాజమాన్యాలు బట్టి పంతుల్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో నేటి తరం బంగారు భవిష్యత్ నాశనం అవుతోంది. అయితే పుస్తకాలతో కుస్తీపడే చదువులకంటే స్మార్ట్ గా ఆలోచించి మెదడుకు పదునుపెట్టే చదువులు అవసరం అని ఇప్పుడిప్పుడే పేరెంట్స్ కి అర్థమవుతోంది. ఇలా చదివినవారే చాలా ఈజీగా మార్కులు సాధిస్తున్నారు. 

25
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కావాల్సింది ఇలాంటి చదువే...

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి బట్టి చదువులు అస్సలు పనిచేయవు... స్మార్ట్ గా చదువుకుంటేనే జాబ్ సాధించగలరు. ఇలాంటి స్మార్ట్ స్టడీస్ నుండి పుట్టిందే 'చండి పాదాల అండ' వాఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకుంటే భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు టకటకా చెప్పవచ్చు.

35
చండి పాదాల అండ అంటే...

"చండి పాదాల అండ" అనే వాఖ్యంలోని ప్రతి అక్షరం ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సూచిస్తుంది.

చం - చండీఘడ్

డి - డిల్లీ

పా - పాండిచ్చెరి

దా - దాద్రా నగర్ హవేలీ

ల - లక్షద్వీప్

అం - అండమాన్ నికోబర్

డ - డయ్యూ డామన్

45
కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకొండిలా...

గతంలో భారతదేశంలో కేవలం 7 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉండేవి. కాబట్టి ఈ ఫార్ములా సరిపోయింది. కానీ ఇటీవల నరేంద్ర మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్రహోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. కాబట్టి ''జై చండి పాదాల అండ' అనే పదాన్ని గుర్తుంచుకుంటే జమ్మూ కాశ్మీర్ కూడా వచ్చేస్తుంది. ఇలా స్మార్ట్ గా ఆలోచించడం ద్వారా పోటీ పరీక్షల్లో కేంద్ర ప్రాంతాల గురించి ప్రశ్న వస్తే ఈజీగా సమాధానం రాయవచ్చు.

55
హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి

బట్టి చదువులు కాకుండా స్మార్ట్ చదువును అలవర్చుకునేలా నేటి తరం విద్యార్థులకు ప్రోత్సహించాలి. అయితేనే భవిష్యత్... లేదంటే డిగ్రీలు వస్తాయేమో గానీ ఆలోచించే తత్వం దెబ్బతింటుంది. ''మెదడుకు పనిచెప్పేలా చదువులుండాలి కానీ దెబ్బతీసేలా కాదు'' అని విద్యారంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇతర జంతువులు ఏదైనా పనిని పదేపదే చేయడంద్వారా అందులో పర్పెక్ట్ అవుతాయి... కానీ మనిషి అలాకాదు తెలివిగా ఆలోచించి పని చేయాలి... జంతువుల్లా పదేపదే చేయడం బట్టి అవుతుంది.. చదువు కాదు.

Read more Photos on
click me!

Recommended Stories