Jobs: జీతం ఎక్కువ వ‌స్తుంద‌ని సంతోషప‌డ‌కండి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఆ కంపెనీ CEO హెచ్చ‌రిక

Published : May 20, 2025, 05:37 PM IST

ఎక్కువ జీతం వ‌చ్చే ఉద్యోగం ఏది అన‌గానే గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్‌. అయితే ఇందులో నిజం ఉన్నా, ఇది ఎక్కువ కాలం కొన‌సాగ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. 

PREV
15
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హెచ్చరిక

జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రిధర్ వెంబు ఓ కీలక హెచ్చరిక చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న వారు పెద్ద జీతాలు పొందుతున్నారని చెప్పినా, అది ఎప్పటికీ కొనసాగుతుందనుకోవద్దని ఆయన సూచించారు.

"మెకానికల్, సివిల్ ఇంజినీర్లు లేదా టీచర్లు అందుకునే జీతాలతో పోల్చితే, టెకీ జీతాలు అసాధారణంగా ఉన్నా, వాటిని సహజ హక్కుగా భావించకూడదు," అని అన్నారు. జీతాలు ఇలాగే కొనసాగుతాయన్న నమ్మకంతో ఉండకూడదని హెచ్చరించారు.

25
AI వల్ల లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు:

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా సాఫ్ట్‌వేర్ రంగం పూర్తిగా మారిపోతుంద‌ని శ్రీధ‌ర్ వెంబు స్ప‌ష్టంగా తెలిపారు. "LLMs (లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్) + టూల్స్ కలయిక సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో విప్ల‌వం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఇది ఉద్యోగాలు పోవ‌డానికి కార‌ణం కావొచ్చు అని అన్నారు.

35
ప్ర‌మాదంలో 40 శాతం ఉద్యోగాలు:

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) 2024 నివేదిక ప్ర‌కారం.. ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు AI వల్ల ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. రెగ్యుల‌ర్ వ‌ర్క్ చేసే వారిపై ఈ ప్ర‌భావం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

45
కొత్త ఉద్యోగాలు వ‌స్తున్నాయ‌న్న దాంట్లో నిజం ఉన్నా.?

AI నిపుణుడు మన్వేంద్ర సింగ్ స్పందిస్తూ, హార్వర్డ్ ప్రొఫెసర్ క్లేటన్ క్రిస్టెన్సన్ అభివృద్ధి చేసిన ‘డిస్‌రప్షన్ ఫ్రేమ్‌వర్క్’ని ప్రస్తావించారు. కొత్త టెక్నాలజీ సాధారణ మార్కెట్లలో ప్రారంభమై, పెద్ద కంపెనీలను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు. ఉదాహరణకు కోడాక్ కెమెరాలు కనిపెట్టినా, డిజిటల్ మార్పును స్వీకరించకపోవడం వల్ల 80% ఉద్యోగాలను కోల్పోయిందని చెప్పారు.

55
కొత్త ఉద్యోగాలు కూడా.

AI కూడా ఇప్పుడే అదే దారిలో ఉందని, GitHub, Copilot వంటి టూల్స్ ద్వారా అభివృద్ధి 55% పెరుగుతోందని చెప్పారు. అయితే, అదే సమయంలో 2025 జనవరిలో 90,000 కొత్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories