Theatre Business: మీ ఊర్లో ప్రైవేటు థియేటర్ పెట్టి నెలకు లక్ష సంపాదించొచ్చు.. పెట్టుబడి కూడా తక్కువే

Published : Aug 05, 2026, 12:20 PM IST

Theatre Business: ఈ మధ్య పట్టణాల్లో ప్రైవేట్ థియేటర్ బిజినెస్ బాగా నడుస్తోంది. ఇది బాగా పాపులర్ అవుతున్న బిజినెస్. ఈ వ్యాపారం మొదలుపెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి, ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోండి.

PREV
13
పాపులర్ అవుతున్న బిజినెస్ ఐడియా

ఇప్పుడు ఒక బిజినెస్ తెగ పాపులర్ అవుతోంది.  యువత, కుటుంబాలు.. ఇలా అందరూ ప్రైవసీ కోరుకుంటారు. అలాంటి వారి కోసంప్రైవేట్ థియేటర్ బిజినెస్ మొదలైంది.  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే ఇంతవరకు పరిమితమైన ఈ బిజినెస్, ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా వచ్చేస్తోంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఫ్రెండ్స్ గెట్‌-టుగెదర్‌ల కోసం చాలామంది వీటిని బుక్ చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి ఒక్క గది చాలు… పెద్ద భవనాలు అవసరం లేదు.

23
500 చదరపు అడుగుల గదితోజజ

ఈ ప్రైవేట్ థియేటర్ మొదలుపెట్టడానికి 500 నుంచి 1,000 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. సొంత స్థలంలో లేదా ఓ హాల్ అద్దెకు తీసుకున్నా చాలు.  మంచి ప్రొజెక్టర్ లేదా పెద్ద టీవీ, సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన సోఫాలు, ఏసీ, అందమైన ఇంటీరియర్, లైటింగ్.. ఇవి మాత్రం చాలా ముఖ్యం. వీటిని ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే చాలా ఏళ్ల పాటూ వాడుకోవచ్చు. సాధారణంగా కస్టమర్లు 1 నుంచి 3 గంటల వరకు బుక్ చేసుకుంటారు. లొకేషన్‌ను బట్టి గంటకు రూ.1,000 నుంచి రూ.2,500 వరకు మీరు డబ్బులు వసూలు చేయవచ్చు.

33
రోజుకు రెండు బుకింగ్స్ వస్తే...

రోజుకు మీకు రెండు బుకింగ్స్ వచ్చినా చాలు… కనీసం రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఆదాయం వస్తుంది. వీకెండ్స్, సెలవు రోజుల్లో బుకింగ్స్ అధికంగా ఉంటాయి. ప్రైవేట్ థియేటర్‌ను సినిమా చూడటానికే కాదు.. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ప్రపోజల్స్, బేబీ షవర్, ఫేర్‌వెల్ పార్టీలు, చిన్న కార్పొరేట్ మీటింగ్‌ల వంటి ఎన్నో ఈవెంట్ల కోసం కూడా వాడుతున్నారు. ఈ వేడుకలకు సీజన్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి, ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. 

ఈ బిజినెస్‌లో  కస్టమర్ అడిగిన థీమ్‌కు తగ్గట్టుగా బెలూన్లు, పువ్వులు, క్యాండిల్ లైట్ డెకరేషన్ చేసి ఇవ్వొచ్చు. సాధారణ బుకింగ్‌కు రూ.1,000 తీసుకుంటే, థీమ్ డెకరేషన్‌తో కలిపి రూ.3,000 నుంచి రూ.8,000 వరకు ప్యాకేజీగా అమ్మవచ్చు. ఫోటోగ్రాఫర్లు, కేక్ షాపులతో భాగస్వామ్యం పెట్టుకుంటే కమిషన్ రూపంలో కూడా సంపాదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories