IRCTC: రైలు ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్. ఇకపై కొందరు ప్రయాణికులకు టికెట్ ధరలో భారీగా డిస్కౌంట్ ఇవ్వబోతోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. కొంతమందికి మాత్రమే. వారెవరో.. ఎలా డిస్కౌంట్ తీసుకోవాలో తెలుసుకోండి.
మనదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అయితే వీరిలో వికలాంగులు కూడా అధికంగానే ఉంటారు. వారి కోసం రైల్వే ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వికలాంగులకు రైలు టికెట్ ధరలో 25 శాతం నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ సదుపాయం కావాలంటే ఆన్‌లైన్‌లోనే 'దివ్యాంగుల రాయితీ కార్డు'కు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికైతే దృష్టి లోపం, మానసిక సమస్యలు, వినికిడి లోపం, మాటల లోపం, కాళ్లు, చేతులు సరిగా లేకపోవడం వంటి వికలాంగులకు ఇది వర్తిస్తుంది. అంతేకాదు వారితో పాటు సహాయకుడిగా వచ్చే వారికి కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
23
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?
దివ్యాంగుల రాయితీ కార్డు ఉంటేనే రైలు టిక్కెట్ ధర తగ్గుతుంది. కాబట్టి దానికోసం అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన దివ్యాంగుల సర్టిఫికెట్, రైల్వే రాయితీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లై చేయాలి. వివరాలు సరిచూశాక, కార్డు జారీ చేసి SMS ద్వారా సమాచారం ఇస్తారు.
33
టికెట్ బుకింగ్ సమయంలో కూడా...
దివ్యాంగుల రాయితీ కార్డును తీసుకున్నాక దాన్ని ఉపయోగించి కౌంటర్‌లో లేదా ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల అర్హులైన ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. వారికున్న లోపాన్ని బట్టి ఎంత డిస్కౌంట్ వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. దివ్యాంగుల కోసం సేవలను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఎన్నో చర్యలు తీసుకుంటోంది.