గంటలో 3 లక్షల బుకింగ్స్.. ఈ ఎల‌క్ట్రిక్ కార్ కోసం ఎగ‌బ‌డుతోన్న జ‌నాలు. అంత‌లా ఏముంద‌బ్బా?

Published : Jul 01, 2025, 02:56 PM IST

xiaomi yu7: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం షావోమి ఇటీవ‌ల మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. షావోమీ వైయూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ కారుకు చైనాలో ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
షావోమీ నుంచి ఈవీ కారు

చైనా మొబైల్‌ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా విడుదల చేసిన YU7 కారుకు చైనాలో భారీగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ కారును మొదటి గంటలోనే ఈ మోడల్‌కు 2.89 లక్షల ప్రీ-ఆర్డర్లు దక్కడం విశేషం.

ఫలితంగా షావోమీ షేర్లు 8 శాతం ఎగబాకాయి. టెస్లా మోడల్‌ వైకి ధీటుగా ఈ కారును షావోమీ అందించడంతో, మస్క్ కంపెనీకి గట్టి పోటీగా మారింది.

25
Xiaomi YU7 ప్రధాన ఫీచర్లు

ఈ కారు టాప్ వేరియంట్‌లో 96.3 kWh బ్యాటరీని అందించారు. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 835 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ కారును మొత్తం మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ధ‌ర విష‌యానికొస్తే రూ. 29 ల‌క్ష‌ల నుంచి అందుబాటులో ఉంది.

ఈ కారులో అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్, ఆప్టిమైజ్డ్ బోడి డిజైన్, అధిక ఎఫిషియన్సీ మోటార్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. తక్కువ సమయంలో అధిక వేగం చేరుకోవ‌డం ఈ కారు ప్ర‌త్యేక‌త‌. కాగా ఇందులో డిజిటల్ డాష్‌బోర్డ్, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

35
షావోమీ EV ప్రయాణం

గడిచిన ఏడాదిలో షావోమీ ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటగా SU7 మోడల్‌ను 2024 మార్చిలో లాంచ్ చేసింది. ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లతో YU7 EV కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ మోడల్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభ ధర 253,500 యువాన్ (మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే రూ. 29 లక్షలు). ఇదే టెస్లా మోడల్‌ వైతో పోల్చితే 4 శాతం తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

45
టెస్లాకు పెరుగుతోన్న పోటీ

చైనా టెస్లాకు అత్యంత కీలకమైన మార్కెట్‌. కంపెనీ ఆదాయంలో సుమారు 20 శాతం చైనా నుంచే వస్తోంది. కానీ 2020లో 15 శాతం మార్కెట్‌షేర్‌ను కలిగి ఉన్న టెస్లా, 2024 నాటికి 10 శాతానికి పడిపోయింది. స్థానిక బ్రాండ్ల నుంచి తీవ్రంగా పోటీ వ‌స్తుండ‌డంతో టెస్లా ధరలు తగ్గించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. షావోమీ లాంచ్ తర్వాత మళ్లీ ధరలను త‌గ్గించ‌డంతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు, ఫైనాన్స్ సదుపాయాలు మెరుగుప‌రుస్తున్నారు.

55
స్థానిక బ్రాండ్ల ఆధిపత్యం

చైనా ఈవీ మార్కెట్‌ వేగంగా మారుతోంది. షావోమీ, బీవైడీ (BYD), నియో (Nio) వంటి కంపెనీలు తక్కువ ధరల్లో అధునాతన మోడళ్లను అందిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా కూడా వీటిలో పోటీ ఎక్కువ. ఇక వినియోగదారుల ఆలోచనలు కూడా బాగా మారుతున్నాయి. దీని వల్ల టెస్లాలాంటి అంతర్జాతీయ కంపెనీలకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories