కష్టాలు వచ్చినా.. ధైర్యం కోల్పోలేదు
కాలేజీ సమయంలో తండ్రి హాస్టల్ ఫీజు కట్టలేకపోయారు. దాంతో కవిత రోజూ 3 గంటలు బస్సులో ప్రయాణించి చదువుకుంది. కానీ ఎప్పుడూ పరిస్థితులకు లొంగలేదు. ఆ ధైర్యమే ఆమెను గొప్ప ట్రేడర్‌గా మార్చింది.
ఆఫీసులో షేర్ మార్కెట్ పరిచయం
పుణేలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, కొంతమంది సహోద్యోగులు షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నట్లు కవిత గమనించింది. మొదట్లో దీన్ని సైడ్ ఇన్‌కమ్‌గా భావించి మొదలుపెట్టింది. కానీ త్వరగానే మార్కెట్ శక్తిని గ్రహించింది. ఆ తర్వాత ట్రేడింగ్ నే ప్రొఫెషన్ గా చేసుకుంది.