Summer Tips: వేసవిలో కార్ ఇంటీరియర్‌ చల్లగా ఉండాలంటే ఈ 7 టిప్స్ పాటించండి

Published : May 10, 2025, 03:56 PM IST

Summer Tips: వేసవిలో కార్‌ను బయట పార్క్ చేసినప్పుడు ఇంటీరియర్ వేడిగా మారడం మామూలే. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కారును వేడి నుంచి కాపాడవచ్చు. దీంతో వేసవిలో కూడా కార్‌ చల్లగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
Summer Tips: వేసవిలో కార్ ఇంటీరియర్‌ చల్లగా ఉండాలంటే ఈ 7 టిప్స్ పాటించండి

కారు పార్క్ చేసినప్పుడు వెంటిలేషన్ ఉండదు కాబట్టి ఆటోమెటిక్ గా కారు లోపల గాలి స్ట్రక్ అయిపోతుంది. ఇక వేసవిలో బయట పార్క్ చేసే కార్ల పరిస్థితి చెప్పనక్కరలేదు. కారులోకి ఎక్కగానే సీట్లు వేడిగా ఉంటాయి. గాలి కూడా పీల్చలేనంత ఇబ్బందిగా ఉంటుంది. వేసవిలో కారు ఇంటీరియర్ చల్లగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

25

1. నీడలో పార్క్ చేయండి

కార్‌ను నీడలో పార్క్ చేయండి. బిల్డంగ్స్, చెట్ల నీడ కింద పార్క్ చేయండి. కుదరకపోతే గడ్డి పైనా టైర్లు ఉండేలా పార్క్ చేయండి. ఇది కార్ ఇంటీరియర్‌ను వేడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

2. విండో టింటింగ్ ఉపయోగించండి

కార్లో విండోలకు టింటింగ్ చేయడం ద్వారా సన్ లైట్, UV కిరణాలను తగ్గించవచ్చు. ఇది కార్ ఇంటీరియర్‌ను చల్లగా ఉంచుతుంది. 

35

3. సన్‌షేడ్‌లు ఉపయోగించండి

విండ్షీల్డ్, ఇతర విండోలకు సన్‌షేడ్‌లు ఉపయోగించడం ద్వారా సూర్యకాంతిని అడ్డుకోవచ్చు. ఇది డాష్‌బోర్డ్, సీట్లు వంటి భాగాలను వేడి నుండి రక్షిస్తుంది.

4. సీటు కవర్లు ఉపయోగించండి

వెంటిలేటెడ్, లైట్ కలర్ సీటు కవర్లు ఉపయోగించడం ద్వారా సీట్లు వేడిగా మారవు. దీంతో కారులో ఎక్కగానే వేడిగా అనిపించదు. 

45

5. విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఉంచండి

కార్‌ను పార్క్ చేసినప్పుడు, విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఉంచడం ద్వారా గాలి ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంటీరియర్ వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

6. ఎయిర్ కండిషనర్‌ను సరిగ్గా ఉపయోగించండి

కార్‌లోకి ప్రవేశించిన వెంటనే విండోలను ఓపెన్ చేసి, ఎయిర్ కండిషనర్‌ను ఫుల్ బ్లోలో ఆన్ చేయండి. ఇది వేడి గాలిని బయటకు పంపిస్తుంది. చల్లని గాలిని లోపలికి తీసుకువస్తుంది. 

55

7. ఇంటీరియర్ భాగాలను కవర్ చేయండి

డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ వంటి భాగాలను కవర్ చేయడం ద్వారా కూడా వేడి నుండి కారును రక్షించవచ్చు. ఇది కార్ పార్ట్స్ జీవితకాలాన్ని పెంచుతాయి. 

ఈ చిట్కాలను పాటించడం ద్వారా వేసవిలో కార్ ఇంటీరియర్‌ను చల్లగా ఉంచుకోవచ్చు. ఇవి మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి

Read more Photos on
click me!

Recommended Stories