Mahindra Thar 2025: కేవలం రూ.11.50 లక్షలకే మహీంద్రా థార్.. ప్రత్యేకంగా యూత్ కోసమే ఈ మోడల్

Published : May 10, 2025, 02:53 PM IST

Mahindra Thar 2025: మహీంద్రా కంపెనీ యువత కోసం ప్రత్యేకంగా థార్ 2025 న్యూ మోడల్ ని సిద్ధం చేసింది. దీన్ని ప్రత్యేకంగా యువత కోసం డిజైన్ చేసినట్లు మహీంద్రా తెలిపింది. పాత థార్ కి 2025 మోడల్ కి ఉన్న తేడాలు, యూత్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Mahindra Thar 2025: కేవలం రూ.11.50 లక్షలకే మహీంద్రా థార్.. ప్రత్యేకంగా యూత్ కోసమే ఈ మోడల్

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 2025 సంవత్సరానికి మహీంద్రా థార్‌ను లేటెస్ట్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్‌తో విడుదల చేసింది. ముఖ్యంగా యువత కోసం ఈ ఎస్‌యూవీని డిజైన్ చేసింది. అయితే ఫ్యామిలీస్ కి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. థార్ న్యూ మోడల్ ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో పాటు నగర ప్రయాణాలకు కూడా అనువుగా తయారు చేశారు. అందువల్ల ఇది నగరాల్లోనే కాదు.. పల్లె రోడ్లపైనా సూపర్ గా నడుస్తుంది. 

25

డిజైన్, భద్రతా ఫీచర్లు

థార్ 2025 మోడల్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టాబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ రోల్ కేజ్, మూడు పాయింట్ల సీట్‌బెల్ట్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

35

రెండు ఇంజిన్ వేరియంట్లలో మహీంద్రా థార్

కొత్త మోడల్ థార్ రెండు ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 
130 bhp శక్తిని, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంది.

2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వేరియంట్ 152 bhp శక్తిని, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్లు శక్తివంతమైన పనితీరును అందించడంలో సహాయపడతాయి.

 

45

మైలేజ్ ఎంత ఇస్తుందంటే..

మహీంద్రా థార్ వేరియంట్ల ఆధారంగా మైలేజ్ ఉంటుంది. డీజిల్ మాన్యువల్ అయితే 15.2 kmpl ఇస్తుంది. అదే డీజిల్ ఆటోమేటిక్ అయితే 13 kmpl ఇస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అయితే 15.2 kmpl మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ అయితే 10.2 kmpl ఇస్తుంది. ఈ మైలేజ్ విలువలు వేరియంట్, డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు.

55

మహీంద్రా థార్ 2025 మోడల్‌ ధరలు

మహీంద్రా థార్ 2025 మోడల్ ప్రారంభ ధర రూ.11.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోనే హై ఎండ్ మోడల్ మాక్సిమం ప్రైజ్ రూ.17.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధరలు కూడా వేరియంట్, ఫీచర్ల ఆధారంగా మారడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వేర్వేరు నగరాల్లో వేర్వేరు ధరలు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories