కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్లపై 6-9 బేసిస్ పాయింట్ల వరకు రుసుములు విధించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానంలో ముందున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 2-10 బేసిస్ పాయింట్ల మధ్య రుసుములు విధించేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నెల 1వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అమలు చేసింది.
ఎస్క్రో ఖాతా కలిగిన పీఏలకు ఒక్క లావాదేవీపై 2 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.02), గరిష్ఠంగా రూ.6 వరకు వసూలు చేస్తోంది.
ఎస్క్రో ఖాతా లేని పీఏలకు 4 బేసిస్ పాయింట్లు (రూ.100 లావాదేవీకి రూ.0.04), గరిష్ఠంగా రూ.10 వరకు ఛార్జీ ఉంది.
వ్యాపారులు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు చేస్తే మాత్రం రుసుము ఉండదు.