8th pay commission: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. రూ. 18 వేలున్న కనీస జీతం ఎంత కానుందో తెలుసా.?

Published : Aug 05, 2025, 12:46 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ కోసం 8వ వేతన సంఘం 2027లో అమలులోకి రానున్న విష‌యం తెలిసిందే. జీతాల పెరుగుద‌ల‌కు సంబంధించిన ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే ఆగ‌స్టు 15న ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

PREV
15
వేతన పెంపుపై తాజా అంచనాలు

8వ వేతన కమిషన్ కింద సుమారు 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 నుంచి నేరుగా రూ.51,000కి పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా అంచనాల ప్రకారం కనీస ప్రాథమిక వేతనం రూ.30,000 వరకు మాత్రమే పెరగవచ్చని తెలుస్తోంది. సగటు వేతన పెంపు 13% ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

DID YOU KNOW ?
ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్
8వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే, కనీస జీతం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరగవచ్చు. పెన్షన్ రూ.9,000 నుంచి రూ.25,740కి పెరుగుతుంది.
25
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు

వేతన పెంపులో కీలకమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన కమిషన్‌లో ఇది 2.57గా ఉండేది. 8వ కమిషన్‌లో ఇది 1.8గా ఉండవచ్చని కోటక్ ఈక్విటీస్ నివేదిక చెబుతోంది. దీని వల్ల వేతనాల్లో పెద్దగా పెరుగుదల ఉండదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌తవుతున్నాయి.

35
అమలు టైమ్‌లైన్

ప్రభుత్వం 2025 జనవరిలో కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ Terms of Reference (ToR) ఇంకా ఖరారు కాలేదు. సభ్యుల నియామకం కూడా జరగలేదు. నివేదిక సమర్పణకు సుమారు 1.5 ఏళ్లు పడవచ్చు. ఆమోదం, అమలు కలిపి మరో 3–9 నెలలు పట్టే అవకాశం ఉంది. ఫలితంగా 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలోనే కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

45
ప్ర‌భుత్వంపై ఎంత భారం ప‌డ‌నుంది.?

8వ వేతన కమిషన్ అమలు వల్ల ప్రభుత్వంపై రూ.2.4 లక్షల కోట్లు నుంచి రూ.3.2 లక్షల కోట్లు వరకు భారం పడవచ్చు. ఇది దేశ జీడీపీ లో 0.6%–0.8% వరకు ఉంటుంది. ముఖ్యంగా గ్రేడ్-సి ఉద్యోగులు (మొత్తం కేంద్ర ఉద్యోగుల్లో 90%) ఎక్కువ లాభం పొందుతారు.

55
ఆర్థిక ప్రభావం

వేతనాలు పెరగడం వల్ల వినియోగ వస్తువులు, ఆటోలు, గృహోపకరణాలపై ఖర్చులు పెరగవచ్చు. జాతీయ పొదుపులు పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories