iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఎప్పుడు? ఆపిల్ ఎన్ని మోడల్స్ తీసుకొస్తోంది?

Published : Aug 05, 2025, 11:35 PM IST

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ విడుద‌ల‌కు ఆపిల్ సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో నాలుగు మోడల్స్ ను లాంచ్ చేయ‌నుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ వివ‌రాలు మీకోసం.

PREV
15
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ విడుదల అప్పుడేనా?

ఆపిల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌ గురించి కీలక సమాచారం వచ్చింది. జర్మన్ న్యూస్ వెబ్‌సైట్ iPhone-Ticker తెలిపిన తాజా లీక్ ప్రకారం, ఆపిల్ వచ్చే ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్ 9న అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమాచారం ఇంకా ఆపిల్ అధికారికంగా ధృవీకరించలేదు.

DID YOU KNOW ?
2007 జూన్ 29న మొదటి ఐఫోన్‌ను విడుదల చేసిన ఆపిల్
ఆపిల్ సంస్థను ఏప్రిల్ 1, 1976న స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నియాక్, రోనాల్డ్ వేన్ కలిసి అమెరికాలో స్థాపించారు. ఈ కంపెనీ క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినోలో ప్రారంభమైంది. ఆపిల్ మొబైల్ ఫోన్ల తయారీని 2007 జూన్ 29న మొదటి ఐఫోన్‌ను విడుదల చేయడంతో ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ మోడల్స్‌ను ఆపిల్ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది.
25
ఐఫోన్ 17 సిరీస్ లీక్ ఎలా బయటపడింది?

iPhone-Ticker నివేదించిన సమాచారం ప్రకారం.. ఒక స్థానిక మొబైల్ నెట్‌వర్క్ క్యారియర్ సంస్థకు చెందిన అంతర్గత డాక్యుమెంట్లలో ఈ వివరాలు లభ్యమయ్యాయి. సాధారణంగా, ఆపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి పెద్ద కంపెనీల కొత్త ఫోన్‌లను ముందుగా క్యారియర్ కంపెనీలతో పంచుకుంటాయి. ఇది వారు తమ మార్కెటింగ్, స్టాక్ తయారీ తదితర ఏర్పాట్లను ముందుగానే చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్ర‌మంలోనే ఒక కంపెనీ నుంచి ఆ వివరాలు పొరపాటున బయటపడ్డట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.

35
iPhone 17 Pro Max ఫోటో లీక్

ఈ లీక్‌కు ముందే కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోటో లీక్ అయింది. షూట్ స‌మ‌యంలో రోడ్డు మీద ఎక్కడో పేర్కొన‌లేదు కానీ, ఓ వ్యక్తి దాన్ని ఫొటో తీయడంతో ఆ చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 

ఇది ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో కనిపించిన రెండర్‌లకు దగ్గరగా ఉండటంతో, అది నిజమైన ఉత్పత్తే కావచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ కూడా దీనిపై స్పందిస్తూ, "ఇది నిజమైనదే" అన్నట్లు పేర్కొన్నారు.

45
ఐఫోన్ లాంచ్ పై ఆపిల్ ట్రెడిషన్ కొనసాగనుందా?

ఈ లీక్ విశ్వసనీయంగా భావించడానికి ప్రధాన కారణాలు.. గత సంవత్సరం కూడా ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9, 2024న ఆపిల్ విడుదల చేసింది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా అదే తేదీని ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే జ‌రిగితే.. ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం అవుతాయి. షిప్పింగ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతుంది.

55
ఐఫోన్ 17 సిరీస్ లో ఎన్ని మోడల్స్ విడుదలయ్యే అవకాశముంది?

ఈసారి ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లో నాలుగు కొత్త మోడల్స్‌ను విడుదల చేయనుందని అంచనా. వాటిలో

1. ఐఫోన్ 17 (iPhone 17)

2. ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro)

3. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max)

4. ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air కొత్త మోడ‌ల్)

ప్రత్యేకంగా ఈ సారి ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air) ను ఆపిల్ ప‌రిచ‌యం చేయ‌నుంది. ఇది సాధారణ ఐఫోన్ 17 కన్నా మరింత స్లిమ్, లైట్ వైయిట్ గా ఉంటుందని సమాచారం. ఇది సామ్‌సంగ్ తాజా గెల‌క్సీ ఎస్ 25 ఎడ్జ్ (Galaxy S25 Edge) మోడల్‌తో పోటీగా నిలవనుంది.

కాగా, ఇప్పటికైతే ఆపిల్ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గత అనుభవాలను, లీకైన సమాచారం విశ్లేషిస్తే, సెప్టెంబర్ 9, 2025న కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories