Gold: ఆల్ టైమ్ కనిష్టానికి గోల్డ్, సిల్వర్ రేట్లు.. ధర భారీగా తగ్గడానికి 3 కారణాలు ఇవే

Published : Nov 22, 2026, 05:42 PM IST

Gold and Silver Prices: కేవలం వారంలోనే బంగారం ధర రూ.12,540, వెండి రూ.20,000 తగ్గింది. ఈ వారంలోనే ఈ ఏడాది కనిష్ఠానికి బంగారం, వెండి ధరలు చేరాయి. అసలు బంగారం, వెండి ధరలు తగ్గానికి కారణాలు ఏంటో తెలుసా? 3 ప్రధాన కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. అసలు రేట్లు ఎందుకు పడిపోతున్నాయో తెలుసా?

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోతూనే ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా సంతోషకరమైన వార్త. కానీ, ఇప్పటికే బంగారంపై పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మాత్రం ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది. కేవలం ఒక్క వారంలోనే, అంటే సోమవారం నుండి శుక్రవారం మధ్య బంగారం ధర ఏకంగా రూ.12,540 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. వారం రోజుల వ్యవధిలో వెండి రేటు రూ.20,000 మేర తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది.

25
వారంలోనే కుప్పకూలిన పసిడి మార్కెట్

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం, నవంబర్ 16వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.1.34 లక్షలుగా ఉండేది. ఆ తర్వాత ప్రతిరోజూ బంగారం ధర క్రమంగా కిందకు దిగివచ్చింది. నవంబర్ 19 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.29 లక్షలకు చేరుకుంది.

ఇక నవంబర్ 20న అయితే బంగారం ధర ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ రోజున 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.22 లక్షలకు చేరింది. వెండి విషయానికి వస్తే, నవంబర్ 16న కిలో వెండి ధర రూ.1.70 లక్షలుగా ఉండేది. నవంబర్ 19 నాటికి అది రూ.1.60 లక్షలకు తగ్గింది. నవంబర్ 20న కిలో వెండి ధర ఏకంగా రూ.1.50 లక్షల స్థాయికి పడిపోయింది.

35
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, దేశీయ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల నుండి 14 క్యారెట్ల వరకు బంగారం, వెండి తాజా ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,23,089 వద్ద కొనసాగుతోంది.

అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,13,203 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.92,688 కాగా, 14 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,297 వద్ద నమోదైంది. మరోవైపు ఒక కిలో వెండి ధర రూ.1,50,650 గా ఉంది.

45
ధరల పతనానికి కారణమైన 3 ప్రధాన విషయాలు ఇవే

బంగారం, వెండి ధరలు ఇంతలా తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికన్ డాలర్ బలపడటం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం ప్రభావం పసిడి ధరలపై నేరుగా పడుతుంది. డాలర్ విలువ ఎంత బలంగా మారితే, బంగారం అంతగా బలహీనపడుతుంది.

ఎందుకంటే ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనడం ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. రెండో కారణం అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మదుపర్లు బంగారం కంటే బాండ్లు, బ్యాంక్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు కిందకు వస్తాయి.

55
లాభాల స్వీకరణ, వెండి డిమాండ్ తగ్గుదల

బంగారం ధర తగ్గడానికి మూడో అతిపెద్ద కారణం మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ధరల తగ్గుదలకు దారితీస్తోంది. మరోవైపు పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్ తగ్గడం వల్ల దాని రేట్లు కూడా పడిపోతున్నాయి. అంతేకాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ కంటే వెండి సరఫరా ఎక్కువగా ఉండటం కూడా వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories