Remote: చాలా మంది ఇళల్లో టీవీ, ఏసీ కామన్‍గా ఉంటాయి. కానీ ఎప్పుడైనా గమనించారా? టీవీ రిమోట్లు నల్లగా ఉంటాయి, ఏసీ రిమోట్లు తెల్లగా, లేదా క్రీమ్ కలర్ లో ఉంటాయి. అసలు దీని వెనుక కారణమెంటో తెలుసా?
ఎలక్రానిక్ పరికరాల డిజైన్‍లో ప్రతి దాని వెనుక ఒక కారణముంటుంది. దాని ఆకృతైనా, దాని కలరైనా ఏదైనా సరే..ఒక సైన్స్ ఉంటుంది. కేవలం డిజైన్ కోసం చేసిన ఎంపిక మాత్రమే కాదు. ఏసీ రిమోట్ గురించి చూస్తే.. ఎక్కువ శాతం ఎయిర్ కండీషనర్లు తెలుపు రంగులోనే తయారవుతాయి. గోడకు అమర్చే ఇండోర్ యూనిట్ కూడా తెల్లగా ఉంటుంది. అందుకే దానికి సరిపోయేలా రిమోట్‌ను కూడా అదే రంగులో డిజైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మొత్తం ఉత్పత్తి ఒకే స్టైల్‌లో కనిపిస్తుంది. ఇది ఇంటీరియర్ డిజైన్‌కు కూడా బాగా సరిపోతుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లు, ఆఫీస్ గదుల్లో లైట్ కలర్స్ ప్రశాంతతను కలిగిస్తాయని డిజైనర్లు భావిస్తారు.
24
ఏసీ రిమోట్ తెల్లగా ఉండటం వల్ల వేడెక్కదు
మరో ముఖ్యమైన కారణం వేడి. తెలుపు రంగు వేడిని తక్కువ లాగుతుంది. బ్లాక్ అయితే వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఏసీ రిమోట్లు ఎక్కువసేపు గదిలోనే ఉన్నా, కొన్ని సందర్భాల్లో కిటికీ దగ్గర లేదా వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేడి పడే అవకాశం ఉంటుంది. తెల్ల రంగు ఉండడం వల్ల రిమోట్ ఎక్కువగా వేడెక్కకుండా సహాయపడుతుంది.
34
బ్లాక్ అయితే నంబర్స్ త్వరగా కనిపిస్తాయి
ఇక టీవీ రిమోట్‌ల విషయానికి వస్తే.. అవి సాధారణంగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనికి మెయిన్ కారణం వాడే విధానం. టీవీ రిమోట్‌ను రోజుకు ఎన్నోసార్లు చేతితో తాకుతాం, ఇంట్లో ఉండేవాళ్లంతా ఎక్కడెక్కడో తిరిగొచ్చి పట్టుకుంటారు. దాంతో చేతిలోని దుమ్ము, చెమట, ఆయిల్ మరకలు రిమోట్‍పై త్వరగా పడతాయి. బ్లాక్ కలర్ అయితే ఇవి అంతగా కనిపించవు. అందుకే కంపెనీలు ఎక్కువగా డార్క్ కలర్స్‌ను ఎంచుకుంటాయి.
అలాగే టీవీ రిమోట్‌లు ఎక్కువ బటన్లు ఉంటాయి. వాటిపై అక్షరాలు, నంబర్లు స్పష్టంగా కనిపించడానికి బ్లాక్ కలర్ పెడతారు. దీంతో బటన్లు గుర్తించడానికి సులభమవుతుంది. బ్లాక్ కలర్ సాధారణంగా టెక్నాలజీ, పవర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను సూచిస్తుంది. అందుకే టీవీలు, సౌండ్ సిస్టమ్‌లు, సెటాప్ బాక్స్‌లు ఎక్కువగా నల్ల రంగులో కనిపిస్తాయి. వాటికి మ్యాచ్ అయ్యేలా రిమోట్‌లను కూడా అదే కలర్‌లో తయారు చేస్తారు. అన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ రంగులను ఎంపిక చేస్తుంటాయి.