Indian Railways: ఇక ఏసీ కోచ్‌లలో ఆ తెల్లటి బెడ్ షీట్లు కనిపించవు, వాటి బదులు ఏమిస్తారు?

Published : Oct 21, 2025, 06:58 PM IST

భారతీయ రైళ్లలో (Indian Railways) ఏసీలలో ప్రయాణించే వారికి తెల్లటి బెడ్ షీట్లు ఇస్తారు. కొన్ని రోజులు తరువాత వారికి ఆ తెల్లటి బెడ్ షీట్లు కనిపించకపోవచ్చు. వాటికి బదులుగా భారతీయ రైల్వేలో కొత్త దుప్పట్లను అందుబాటులోకి తెస్తోంది.  

PREV
14
రైళ్లలో తెల్లటి దుప్పట్లు మారుతున్నాయి

భారతీయ రైళ్లలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అలాంటి వారికి తెల్లటి బెడ్ షీట్లను అందిస్తారు. రైళ్లల్లో సుదూర ప్రాంతాల్లో ప్రయాణించేవారు అధికంగా ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు నిద్రించడానికి సౌకర్యంగా ఉండాలని దుప్పట్లు, దిండ్లు వంటివి అందిస్తారు. కొన్ని రైళ్లలో తెల్లటి తువ్వాలును కూడా అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తెల్లటి బెడ్ షీట్లు మారబోతున్నాయి.

24
తెల్లటి బెడ్ షీట్లతో సమస్య

ఇకపై ఏసీ కోచులలోని ప్రయాణికులకు తెల్లటి బెడ్ షీట్లను ఇవ్వరు. వాటికి బదులుగా కాటన్ క్లాత్ తో చేసిన డిజైన్లు ఉన్న దుప్పట్లను అందిస్తారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పని చేసినట్టు చెబుతున్నారు. తెల్లటి బెడ్ షీట్ల పై మరకలు అంటితే ఒకంతట పోవు. వాటిని తిరిగి వాడేందుకు ప్రయాణికులు ఇష్టపడడం లేదు. భారతీయ రైల్వే చెబుతున్న ప్రకారం ఏసీ కోచ్ లలో ప్రయాణికులకు ఇచ్చే తెల్లటి షీట్లను ప్రతిరోజు శుభ్రం చేయరు. వాటిని కేవలం నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉతుకుతారు. కాబట్టి అవి మురికిగానే ఉంటాయి. దీని వల్ల ప్రయాణికులకు పరిశుభ్రత విషయంలో సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

34
ప్రింటెడ్ దుప్పట్లు

ఇకనుండి వీటికి బదులు ప్రింటెడ్ దుప్పట్లను అందిస్తారు. ఈ దుప్పట్లు సాంస్కృతికమైన ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా జైపూర్లో ఈ దుప్పట్లను ప్రారంభించారు.మొదట జైపూర్ - అసర్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో వీటిని అందించారు. ఇక్కడ నుంచి అన్ని రైళ్ళకు ఈ దుప్పట్లను అందించనున్నారు. తెల్లటి దుప్పట్లు చూసేందుకు ఆసుపత్రిని గుర్తుతెచ్చేవిగా ఉండడం కూడా కొంతమంది ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకే డిజైనర్ దుప్పట్లను రంగంలోకి దింపారు.

44
ఏ రైలుతో మొదలుపెట్టారు?

ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టిన దుప్పట్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిపై ఉండే బ్లాక్ ప్రింటింగ్ సంగనేరి అనే ప్రాంతానికి చెందింది. ఇది జైపూర్ సమీపంలోనే ఒక చిన్న పట్టణం. శతాబ్దాలుగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ కు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పూల నమూనాలు, గీతలు వంటి వాటితో అందంగా కనిపిస్తుంది. భారతీయ రైల్వేలో సంస్కృతికి సంప్రదాయాలకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశాన్ని కూడా ఈ దుప్పట్లతో చాటుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories