D-Mart లో ఈ D అంటే ఏమిటో తెలుసా?

Published : Aug 02, 2025, 06:58 PM ISTUpdated : Aug 02, 2025, 07:07 PM IST

D-Mart origin story in telugu : మధ్యతరగతి ప్రజల కిరాణా కొట్టుగా గుర్తింపుపొందింది డీమార్ట్. ఈ D-Mart లో D ఏమిటో మీకు తెలుసా? 

PREV
15
D-Mart స్టోరీ

D-Mart : ఈపేరు వింటేనే మధ్యతరగతి ప్రజల ముఖాల్లో తెలియకుండానే చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ వంటి నగరాల్లో జీవించే మధ్యతరగతి జీవులకు డీమార్ట్ తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. గతంలో వీధిచివరన కనిపించే దుకాణంలాగే వారు ఈ డీమార్ట్ ను భావిస్తున్నారు... ఏ చిన్న వస్తువు కావాలన్నా మన డీమార్ట్ ఉందిగా అనేంత ధీమాతో ఉన్నారు. సామాన్యుల నమ్మకాన్ని ఇంతలా పొంది వారి మనసుకు చాలా దగ్గరయ్యింది డీమార్ట్.... అందుకే ఈ సూపర్ మార్కెట్ పేరు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే నిత్యం ఈ D-Mart పేరు వినిపిస్తుంది... నెలలో ఒకటి రెండుసార్లయినా ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం ఇక్కడికి వెళుతుంది. ఇలా మీరు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నివాసముంటే ఒక్కసారైనా డీమార్ట్ కు వెళ్లివుంటారు. ఈ సమయంలో మీకు అసలు D-Mart పూర్తిపేరు ఏమిటనే డౌట్ వచ్చివుంటుంది? దీన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం... D-Mart లో ఈ D ఏంటో తెలుసుకుందాం.

DID YOU KNOW ?
2002 లో డీమార్ట్ ప్రస్థానం ప్రారంభం
2002 లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డీమార్ట్ ప్రస్థానం ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. డీమార్ట్ వ్యవస్థాపకులు రాధాకిషన్ దమానీ ప్రస్తుతం దేశంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరు.
25
D-Mart యజమాని ఎవరో తెలుసా?

నగరంలో జీవనమంటేనే బిజీ బిజీ... ఉద్యోగులు పనిలో బిజీ, వ్యాపారులు దందాలో బిజీ, గృహిణులు ఇంటిపనిలో, విద్యార్థులు చదువులో బిజీ బిజీ. ఇలాంటి బిజీ నగరాల్లో ఇంట్లోకి అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులను ఒకేచోట అదీ అందుబాటు ధరల్లో లభిస్తే.. ఇదే D-Mart. బిజీ జీవితాన్ని గడుపుతున్న సాధారణ ప్రజలకు డీమార్ట్ ఒక విలువైన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ ఉరుకులు పరుగుల జీవనశైలిలో వన్ స్టాప్ షాపింగ్ కు ఫర్ఫెక్ట్ ప్లేస్ గా నిలుస్తోంది. 

ఈ డిమార్ట్ ను స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు రాధాకిషన్ దమానీ స్థాపించారు. 1980లలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులతో తన ప్రయాణాన్ని ప్రారంభించి రాధాకిషన్ దమాని వ్యూహాత్మక పెట్టుబడులతో కోట్లాది సంపాదించారు. మార్కెట్ అవసరాలపై లోతైన అవగాహనతో 2002లో డీమార్ట్‌ను స్థాపించి రిటైల్ సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఇప్పుడు బిలియనీర్ గా మారి భారత వ్యాపార రంగంలో గౌరవనీయ వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు. 

35
D-Mart కు ఆ పేరెలా వచ్చింది?

అయితే మధ్యతరగతి ప్రజలకోసం ఓ సూపర్ మార్కెట్ ను స్థాపించాలని భావించిన రాధాకిషన్ దమానీ మొదట ఏ పేరు పెట్టాలని ఆలోచించారట. చివరికి ఏ పేరో ఎందుకు.. తన పేరుతోనే స్థాపిస్తే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో 'దమానీ మార్ట్' పేరిట ముంబైలో సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు... ఇది సక్సెస్ కావడంతో దమానీ సూపర్ మార్కెట్ కాస్త 'డీ-మార్ట్'గా మారింది. ప్రస్తుతం ఈ సంస్థను 'అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్' నిర్వహిస్తోంది.

45
ఇండియాలో D-Mart ప్రస్థానం

ప్రతి ఇంటికి నాణ్యమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండాలన్న దృక్పథంతో D-Mart బ్రాండ్ పనిచేస్తోంది. వ్యాపార సమర్థతతో పాటు సామాజిక బాధ్యత కూడా డీ-మార్ట్ ధరల విధానాన్ని ప్రభావితం చేస్తోంది.

ప్రస్తుతం డీమార్ట్ దేశంలోని 11 రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ) వ్యాపారాన్ని సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 375కిపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. స్థానిక వినియోగదారుల అవసరాల మేరకు ప్రతీ స్టోర్ సేవలందిస్తుంది. చాలా స్టోర్లలో ఎప్పుడూ సందడి కనిపిస్తుంది. అధిక అద్దె ఖర్చులు లేకుండా డీ-మార్ట్ సొంత భవనాల్లోనే స్టోర్లు నిర్వహిస్తోంది… ఇది కూడా అక్కడ ధరలు తక్కువగా ఉండడానికి ఓ కారణం. 

55
ఆన్ లైన్ జమానాలోనూ D-Mart హవా

బడ్జెట్, శుభ్రత, వినియోగదారుల సేవలో ముందుండే డీమార్ట్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా విస్తరణకు అవకాశాలు కలిగిన సంస్థగా నిలుస్తోంది. మధ్యతరగతి జీవన శైలిలో ఇది భాగమవడమే కాకుండా రిటైల్ రంగంలో తనదైన లాభాలతో దూసుకుపోతోంది. ఆన్ లైన్ లో సరుకులు సరఫరా చేసే అనేక యాప్స్ వచ్చినా డీమార్ట్ పై ఇప్పటికీ సామాన్యుడి నమ్మకం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ ఇది సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories