Most Gold used Countries
Top 10 countries by gold consumption: ప్రపంచంలో అత్యధిక బంగారం వినయోగించే దేశాల్లో భారత్ ఒకటి. బంగారం వినియోగంలో భారతదేశం 2024లో చైనాను అధిగమించింది. భారత్ లో గోల్డ్ కు ఉన్న డిమాండ్, సాంస్కృతిక సంప్రదాయాలు, పెట్టుబడి ప్రాధాన్యతలు, పారిశ్రామిక ఉపయోగాల క్రమంలో భారత్ లో బంగారం వినియోగం అధికంగా ఉంది. అత్యధిక బంగారం వినియోగం ఉన్న టాప్ 10 దేశాల వివరాలు గమనిస్తే..
10. ఇండోనేషియా:
ఇండోనేషియా బంగారం వినియోగంలో టాప్-10 దేశాల్లో 10వ స్థానంలో ఉంది. ఈ దేశంలో గోల్డ్ వినియోగం ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఉంటుంది. ఆ తర్వాత పొదుపు, పెట్టుబడిగా ఉంది. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ కు మస్తు డిమాండ్ ఉంటుంది.
9. వియత్నాం:
వియత్నాంలో గోల్డ్ పై పెట్టుబడులు అధికంగా ఉంటాయి. అభరణాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక ఆసియా దేశాల మాదిరిగానే బంగారం అంటే చాలు అల్లుకుపోతారు ఇక్కడి ప్రజలు.
What are the top 10 countries that use the most gold in the world? Where does India rank?
8. ఇరాన్:
ఇరాన్ సాంస్కృతిక అంశాలతో బంగారం ముడిపడి ఉంటుంది. ఇరాన్‌లో బంగారం ఎక్కువగా అభరణాలు, పెట్టుబడితో పాటు తమ ఆర్థిక అస్థిరత, కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాలతో బంగారం ఎక్కువగా కొనిపెట్టుకుంటారు.
7. టర్కీ:
టర్కీలో బంగారం సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక్కడ గోల్డ్ ను ఆభరణాలతో పాటు సాంప్రదాయ పెట్టుబడి ఆస్తిగా చూస్తారు. ఎక్కువగా గోల్డ్ నాణేలు, గాజుల రూపంలో ఉంటుంది.
What are the top 10 countries that use the most gold in the world?
6. సౌదీ అరేబియా:
బంగారు ఆభరణాలకు బలమైన సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు అద్భుతమైన డిజైన్‌లు, లగ్జరీ లైఫ్ కు సూచీగా బంగారాన్ని చూస్తారు. అందుకే సౌదీ అరేబియాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది.
5. థాయిలాండ్:
థాయిలాండ్‌లో కూడా బంగారినికి మస్తు డిమాండ్ ఉంటుంది. అలంకరణ, సాంప్రదాయ పొదుపు-పెట్టుబడి రూపంగా గోల్డ్ ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ బంగారు దుకాణాలు చాలా ఉంటాయి. పెళ్లిళ్ల సమయంలో బంగారు కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయి.
top 10 countries that use the most gold
4. జర్మనీ:
యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జర్మనీ బంగారు వినియోగం కడ్డీలు, నాణేల రూపంలో కనిపిస్తుంటుంది. గోల్డ్ ను ధరించడంతో పోలిస్తే నిల్వకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే, పారిశ్రామిక వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది.
3. యునైటెడ్ స్టేట్స్ (అమెరికా):
అమెరికాలో బంగారు వినియోగం కేవలం ఆభరణాలకే మాత్రమే పరిమితం కాదు.. పారిశ్రామికంగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే, పెట్టుబడులు, నిల్వ చేసుకోవడం, ఎలక్ట్రానిక్స్, వైద్య రంగం, అంతరిక్ష రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
Top 10 countries by gold consumption
2. చైనా:
బంగారం అధికంగా ఉపయోగించే ప్రపంచ దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. బంగారు ఆభరణాల పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం కారణంగా బంగారం డిమాండ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అభరణాలతో పాటు బంగారు కడ్డీలు, నాణేలకు డిమాండ్ ఉంటుంది. అలాగే, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో చైనా బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటుంది.
1. భారత్:
ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారత్. గతేడాది చైనాను అధిగమించి మొదటి స్థానంలోకి వచ్చింది. భారత్ లో సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు, వివాహాలు, పండుగలతో బంగారానికి బలమైన అనుబంధం ఉంటుంది. ఆభరణాల తయారీలో బంగారం డిమాండ్ భారత్ లో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలాగే, బంగారం కొనిపెట్టుకోవడానికి, పెట్టుబడులకు కూడా భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. బంగారాన్ని భారత్ లో బలమైన ఆస్తిగా కూడా చూస్తారు అందుకే బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.