బంగారం నచ్చినవారు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా భారతీయులు బంగారాన్ని మరింత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పండగ వచ్చినా, శుభకార్యం వచ్చినా కచ్చితంగా బంగారం కొనాల్సిందే అనే భావనలో ఉంటారు. అంతేకాదు.. బంగారం ఎక్కువగా ఉండటం అనేది వారి స్టేటస్ ని కూడా తెలియజేస్తుంది. కానీ.. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతోంది. తులం బంగారమే దాదాపు లక్ష రూపాలయకు చేరువైంది. అసలు, ఎప్పటికైనా ఈ పసిడి ధర తగ్గుతుందా? తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
బంగారం ఒక అరుదైన లోహం. భూమిలో దీని నిల్వలు పరిమితంగా ఉంటాయి. అందుకే దాని ఎప్పటికీ సున్నా కాదు. బంగారం సరఫరా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. దాని ధర ఎప్పటికీ సున్నా కాదు. సరఫరా పెరిగినా, డిమాండ్ తగ్గదు. ఎందుకంటే ఇది విలువైనది. నమ్మకమైనది.