Water Bottle: ఈ స‌మ్మ‌ర్‌లో చుక్క‌లే.. భారీగా పెర‌గ‌నున్న‌ వాట‌ర్ బాటిల్ ధ‌ర‌లు. కార‌ణం ఏంటంటే

Published : Mar 17, 2026, 10:47 AM IST

Water Bottle: ఎండ తీవ్ర‌వ పెరుగుతున్న సమయంలో బాటిల్ తాగునీటి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తయారీ ఖర్చులు ఒక్కసారిగా పెరగడం వల్ల చిన్న కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచడం ప్రారంభించాయి. ఇంత‌కీ వాట‌ర్ బాటిల్ ధ‌ర‌లు ఎందుకు పెర‌గ‌నున్నాయో ఇప్పుడు చూద్దాం

PREV
15
ఇప్పటికే ప్రారంభమైన ధరల పెంపు

భారత్‌లోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీదారుల సంఘం సమాచారం ప్రకారం. దాదాపు 2,000 చిన్న కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచాయి. ఒక్క బాటిల్‌పై సుమారు రూపాయి పెంచారు. ఇది దాదాపు 5% పెరుగుదలగా చెబుతున్నారు. ప్రస్తుతం వినియోగదారులు 1 లీటర్ బాటిల్‌కు సాధారణంగా రూ. 20 లోపే చెల్లిస్తున్నారు. కానీ త్వరలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

25
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

బాటిల్ నీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ కొరత, ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాప్స్, లేబుల్స్, కార్డ్బోర్డ్ బాక్స్ అన్నీ ఖ‌ర్చులు పెరిగాయి.

35
పాలిమర్ ధరలు భారీగా పెరిగాయి

ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే ముఖ్య పదార్థం పాలిమర్. ప్ర‌స్తుతం పాలిమర్ ధర 50% పెరిగి కిలోకి రూ. 170కి చేరింది. బాటిల్ క్యాప్ ధర రెండు రెట్లు పెరిగి ₹0.45 అయింది. ఇవే తయారీ ఖర్చును గణనీయంగా పెంచుతున్నాయి.

45
ప్రీమియం వాటర్ మార్కెట్‌పైనా ప్రభావం

కేవలం సాధారణ బాటిల్ వాటర్ మాత్రమే కాదు, ప్రీమియం వాటర్ మార్కెట్‌పైనా ప్రభావం ఉంది. కొన్ని కంపెనీలు ధరలను 18% వరకు పెంచాయి. ప్రీమియం వాటర్ మార్కెట్ విలువ దాదాపు $400 మిలియన్‌గా ఉంది. గత కొన్నేళ్లలో ఈ సెగ్మెంట్ వేగంగా పెరుగుతోంది ఎక్కువ కంపెనీలు వినియోగదారులను కోల్పోకుండా ఉండటానికి కొంత ఖర్చును తాము భరిస్తున్నాయి.

55
భవిష్యత్తులో వినియోగదారులపై ప్రభావం

ప్రస్తుతం పెద్ద కంపెనీలు ధరలను పెంచ‌కుండా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ. త్వరలోనే రిటైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మరో 10% వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వేసవి కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల ప్రకారం, వచ్చే 4–5 రోజుల్లోనే వినియోగదారులు ఈ మార్పును గమనించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories