Today Gold Rate in Hyderabad: బంగారం రేట్లు ఢమాల్...ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Published : Mar 16, 2026, 11:05 AM IST

Today Gold Rate in Hyderabad: బంగారం రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులు పండుగ చేసుకుంటున్నారు. అటు వారం రోజులుగా ధరలు క్షీణించడం ఊరట కలిగిస్తోంది. మరి హైదరాబాద్‍లో మార్చి 16 న గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం 

PREV
15
అసలెందుకు పెరుగుతోంది?

ఉగాది దగ్గరపడుతోంది. కొత్త ఏడాది కాబట్టి బంగారం, వెండి కొనేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో బంగారం, వెండి రేట్లు పతనం కావడం...బిగ్ రిలీఫ్ ఇస్తోంది. చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత వారం రోజులుగా రేట్లు కుప్పకూలుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా మార్కెట్లు పెరగాల్సింది పోయి తగ్గడం అనుమానాలకు తావిస్తోంది.

25
ఉగాది సమయానికి పెరుగుతుందంటున్న నిపుణులు

ఇప్పుడు రేట్లు తగ్గుతున్నాయని సంబరపడిపోతున్నా...ఉగాది సమయానికి ఇంకెంత పెరుగుతుందో ఓవైపు కంగారు పడుతున్నారు కూడా. అందుకే ఇప్పుడే బంగారం కొనేందుకు ఎగబడుతున్నారు. నెలక్రితం కొండెక్కిన ధరలు...వారం రోజులుగా దిగి వస్తున్నాయి.

35
24 క్యారెట్ల బంగారం ధర రూ.490పై తగ్గుదల

ఇక ఈరోజు కూడా పసిడి రేట్లు భారీగానే తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ. 1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్లపై రూ.450 తగ్గి రూ.1,45,900 పలుకుతోంది. అయితే ఈ ధరలు హైదరాబాద్‍లో ఉన్నాయి. విజయవాడ, విశాఖలో ధరలు ఒకేలా ఉన్నా...చెన్నై, బెంగళూరులో మాత్రం కాస్త మార్పులు కనిపిస్తున్నాయి.

45
బంగారం కొనే టైం వచ్చిందనే ఆలోచనలో కొనుగోలుదారులు

వారం ప్రారంభంలోనే ధరలు మళ్లీ తగ్గాయి. ఈ ధరలు చూసి బంగారం కొనే టైం వచ్చిందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అయితే 18 క్యారెట్ బంగారం ధర రూ.360 తగ్గి రూ.1,19,380 వద్ద స్థిరపడింది. వెండి ధరలు కూడా తగ్గుతూ ఊరట కలిగిస్తోంది. కొన్నిరోజులుగా రూ.3లక్షలు-రూ.2.75 లక్షల మధ్య ఊగిసలాడుతోంది.

55
భవిష్యత్‍లో పెరిగే అవకాశం

డాలర్ బలం, చమురు పెరగడంతో ఇటు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భవిష్యత్‍లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వెళ్తున్నారు. డాలర్ బలపడటంతో అటువైపుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories