మొదట్లో పెట్రోల్, డీజిల్ కార్లు.. ఆ తర్వాత సీఎన్‌జీ. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో రోడ్లపై సోలార్ కార్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కారును కనీసం ఛార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కాస్త ఎండ తగిలితే చాలు రయ్యిమని దూసుకుపోనున్నాయి. భారతదేశంలో తొలి సోలార్ కారు అందుబాటులోకి వచ్చేసింది.
జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించిన ఆటో ఎక్స్‌పో 2025లో ఈ సోలార్ కారును ప్రదర్శించారు. వేవ్ ఈవా (Vayve Eva) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త కారు ఇంకా రోడ్లపైకి రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర కేవలం రూ. 3 లక్షలు మాత్రమే కావడం విశేషం. ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో అస్సలు రాజీ పడాల్సి అవసరం లేదు.
అన్ని ఇతర కార్లలోలాగే ఇందులో కూడా మంచి ఫీచర్లను అందించారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు. ఇక ఈ కారును నోవా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.