Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే

Published : Oct 11, 2026, 09:27 AM IST

Smartphones: అమెరికాతో పోలిస్తే భారతదేశంలో ఐఫోన్, పిక్సెల్ వంటి స్మార్ట్‌ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి? ఇలా ఫోన్ల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? జీఎస్టీ, కస్టమ్ డ్యూటీ, ఇతర కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఐఫోన్ నుంచి పిక్సెల్ వరకు: విదేశాల కంటే ఇండియాలోనే ఫోన్లు రేట్లు ఎందుకు ఎక్కువ?

ప్రతిసారీ కొత్త ఐఫోన్ లేదా పిక్సెల్ లాంచ్ అయినప్పుడు భారత్‌లో ఒకే ఒక ప్రశ్న వినిపిస్తుంది. అదే ఫోన్ అమెరికాలో అంత తక్కువ ధరకు వస్తే, మన దేశంలో మాత్రం ఎందుకు అంత ఖరీదుగా లభిస్తుంది? ఈసారి ఈ ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రోను భారత్‌లో లాంచ్ చేయగా, గూగుల్ సంస్థ పిక్సెల్ 11 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ కూడా భారత్‌కు చేరుకుంది.

అయితే, ఈ మూడింటి ధరలను అమెరికాతో పోలిస్తే, భారతీయ వినియోగదారుడు అదే డివైజ్ కోసం ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ అమెరికాలో 100 డాలర్ల కన్నా తక్కువే ఉండగా, భారత్‌లో అది రూ. 13 వేల ధరకు లాంచ్ అయింది. అయితే ఆపిల్, గూగుల్ సంస్థలు భారత్‌లో కేవలం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయనేది నిజం కాదు. దీని వెనుక అమెరికన్ ప్రైసింగ్ పద్ధతి, భారతీయ జీఎస్టీ, కస్టమ్ డ్యూటీ, రూపాయి మారకం విలువ, స్థానిక తయారీ, కంపెనీల ప్రైసింగ్ స్ట్రాటజీ, రిటైల్ మార్జిన్లు వంటి అనేక అంశాలు దాగి ఉన్నాయి.

25
ఐఫోన్ 18 ప్రో ధరల లెక్కలు ఎలా ఉంటాయంటే?

ఆపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో అమెరికన్ ప్రారంభ ధరను 1,199 డాలర్లుగా నిర్ణయించింది. అదే సమయంలో భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉంది. 2026 అక్టోబర్ 1 నాటికి డాలర్ మారకం విలువ సుమారు రూ. 96 వద్ద ఉంది. ఈ లెక్కన 1,199 డాలర్లను నేరుగా రూపాయల్లోకి మారుస్తే దాదాపు రూ. 1.15 లక్షలు అవుతుంది. ఇక్కడే భారతీయ కస్టమర్‌కు పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది.

అమెరికాలో కనిపిస్తున్న 1,199 డాలర్ల ధరను, భారత్‌లోని రూ. 1,64,900 ధరతో నేరుగా పోలిస్తే సుమారు రూ. 50 వేల తేడా స్పష్టంగా ఉంది. అయితే అమెరికాలో ఆపిల్ చూపించే ధర తుది వినియోగదారుడి ధర కాదు. అక్కడ సేల్స్ ట్యాక్స్ అనేది రాష్ట్రం, నగరం బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా చెక్అవుట్ సమయంలో ఈ ట్యాక్స్ కలుస్తుంది. అంటే ఆపిల్ వెబ్‌సైట్‌లో కనిపించే 1,199 డాలర్ల ధరకు, అమెరికన్ కస్టమర్ చెల్లించే ఫైనల్ పేమెంట్‌కు తేడా ఉంటుంది.

35
భారత్‌లో జీఎస్టీ, ట్యాక్స్ విధానంతో ధరల్లో మార్పులు

మరోవైపు భారత్‌లో చూపించే రూ. 1,64,900 ఎమ్‌ఆర్‌పీ ధరలో జీఎస్టీ పూర్తిగా కలిసి ఉంటుంది. అంటే ప్రారంభం నుంచే రెండు దేశాల ప్రైస్ ట్యాగ్‌లను ఒకే పద్ధతిలో పోల్చలేము. భారత్‌లో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 18 శాతంగా అమలవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ రికార్డుల ప్రకారం మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడం జరిగింది. ఇది 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

దీని అర్థం రూ. 1,64,900 విలువైన ఐఫోన్ 18 ప్రో మొత్తంలో ఆపిల్ సంస్థ సంపాదన అంతా ఉండదు. కేవలం అవగాహన కోసం చూస్తే, 18 శాతం జీఎస్టీని మినహాయిస్తే రూ. 1,64,900 ధరలో ప్రీ-జీఎస్టీ భాగం దాదాపు రూ. 1.40 లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఐఫోన్ 18 ప్రో భారత్‌లో అమెరికన్ ప్రీ-ట్యాక్స్ ధరతో పోలిస్తే చాలా ఖరీదుగానే కనిపిస్తోంది.

45
జీఎస్టీ మినహాయించినా మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది?

కేవలం జీఎస్టీ ఒక్కదానితోనే ఐఫోన్ 18 ప్రో ధరల వ్యత్యాసాన్ని పూర్తిగా వివరించలేము. అసలు మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది మరో ప్రశ్న. ఇక్కడే దిగుమతి సుంకాలు, విడిభాగాలు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, రిటైల్ మార్జిన్లు, ఆపిల్ ప్రైసింగ్ స్ట్రాటజీ వంటి అంశాల పాత్ర ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ తయారవుతోంది అంటే ఫోన్‌లోని ప్రతి విడిభాగం భారత్‌లోనే తయారైందని అర్థం కాదు. ఆపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీకి సంబంధించి పెద్ద ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. అయినప్పటికీ స్మార్ట్ సప్లై చైన్ ఇప్పటికీ పూర్తిగా లోకల్ కానేకాదు. చాలా కీలకమైన విడిభాగాలు ఇప్పటికీ గ్లోబల్ సప్లై చైన్ ద్వారానే మన దేశానికి వస్తుంటాయి.

55
కంపెనీల వ్యూహాలు.. ఇతర ఆర్థిక కారణాలు

స్మార్ట్‌ఫోన్ల ధరల్లో వ్యత్యాసానికి రూపాయి విలువ బలహీనపడటం కూడా ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే విదేశీ కరెన్సీ చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా కంపెనీలు నిర్దిష్టమైన ఉత్పత్తులను ఏ మార్కెట్లోని ఏ సెగ్మెంట్‌లో ఉంచాలనే దానిపై ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తాయి.

లాజిస్టిక్స్ ఖర్చులు, రవాణా ఛార్జీలు, స్థానిక మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు కూడా తుది ధర నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అన్ని కారణాల కలయిక వల్లనే అమెరికా మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ 18 ప్రో, పిక్సెల్ 11, ఫిట్‌బిట్ ఎయిర్ వంటి గాజెట్స్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories