UPI New Rules: ఫోన్‌పే చేసే వారికి అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ 15 నుంచి కీల‌క మార్పులు. పండగే పండగ..

Published : Sep 15, 2025, 09:28 AM IST

UPI New Rules: దేశంలో డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతున్న నేప‌థ్యంలో నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కొన్ని కీల‌క మార్పులు చేసింది. మారిన ఈ నిబంధ‌న‌లు సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇంత‌కీ ఆ మార్పులు ఏంటంటే.? 

PREV
15
రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంపు

డిజిటల్ చెల్లింపులు చేసే వారికి గుడ్ న్యూస్‌. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు వ్యక్తి నుంచి వ్యాపారి (P2M) లావాదేవీల పరిమితి రూ. 10 లక్షల వరకు పెంచారు. ఈ మార్పుతో పెద్ద మొత్తాలను డిజిటల్‌గా చెల్లించడం మరింత సులభతరం కానుంది.

25
బీమా ప్రీమియం చెల్లింపులపై సవరణలు

ఇప్ప‌టి వ‌ర‌కు యూపీఐ ద్వారా బీమా ప్రీమియం, పెట్టుబ‌డులు గ‌రిష్టంగా రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. అయితే ఇప్పుడీ లిమిట్‌ను రూ. 5 ల‌క్ష‌ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే రోజుకు మొత్తంగా చెల్లించగలిగే పరిమితి రూ. 10 లక్షలకు మించి ఉండకూడదు. దీని వల్ల పెట్టుబడిదారులు, పాలసీదారులు సులభంగా పెద్ద మొత్తాలను డిజిటల్ విధానంలో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

35
ఆ ప‌రిమితి కూడా పెంపు

యూపీఐ ద్వారా ప్రయాణ ఖర్చులు, క్రెడిట్ కార్డు బిల్లులు, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) వంటి వర్గాలకు కూడా రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితి పెరిగింది. దీంతో వ్యాపార అవసరాల కోసం లేదా వ్యక్తిగత ఉపయోగాల కోసం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు మరింత సౌకర్యంగా మారాయి.

45
ఆభరణాల కొనుగోలు, బ్యాంకింగ్ సేవలు

యూపీఐ ద్వారా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాన్ని మెరుగుప‌రిచారు. గ‌తంలో ఒకేసారి రూ. ల‌క్ష వ‌ర‌కు మాత్ర‌మే లావాదేవీ చేసే అవ‌కాశం ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్‌ను రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచారు. అయితే రోజులో మొత్తం ఆభరణాల లావాదేవీలు రూ. 6 లక్షలకు మించకూడదు. అలాగే డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి బ్యాంకింగ్ సేవలకు ఒక్క లావాదేవీ పరిమితి రూ. 5 లక్షల వరకు పెంచారు.

55
వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) లావాదేవీల్లో మార్పులేదు

ప్రస్తుతానికి P2P చెల్లింపుల పరిమితి రోజుకు రూ. లక్షగా కొనసాగుతుంది. అంటే, ఒక వ్యక్తి నుంచి మరొకరికి డబ్బు పంపే సందర్భంలో ఎటువంటి మార్పు లేదన్న‌మాట‌. ఈ కొత్త సవరణల వల్ల పెద్ద మొత్తాల లావాదేవీలను చిన్నచిన్న విడతలుగా చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. వ్యాపారాలు, బీమా చెల్లింపులు, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులు వంటి విభాగాల్లో డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. NPCI తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు, వ్యాపారవేత్తలకు లాభం చేకూరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories