అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 23 నుంచి ఈ సేల్ మొదలవుతుంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు దక్కే అవాశం ఉంది. అలాగే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయిి.
మనదేశంలో అతిపెద్ద పండుగ సీజన్ సెప్టెంబరు నుంచే మొదలవుతుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఈ సమయంలోనే వస్తాయి. అందుకే ఈ కామర్స్ సైట్లు కూడా ఆ సమయంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025, సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. కస్టమర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు, అమెజాన్ 'ఎర్లీ డీల్స్' పేరుతో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఇతరులకన్నా ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 22 నుండే ఈ ఆఫర్లను పొందే అవకాశం ఉంది.
23
స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు!
ఈ సేల్‌లో ఫోన్లు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. OnePlus, iQOO, Samsung, Apple వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. గత సంవత్సరం విడుదలైన OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ రూ. 18,499 ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే, iQOO Z10 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ. 10,998కి లభించడం బడ్జెట్ కస్టమర్లకు శుభవార్త.
33
టీవీలపై భారీ క్యాష్ బ్యాక్
టీవీ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో QLED, Mini LED, OLED 4K స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. టీవీల కొనుగోళ్లపై బ్యాంక్ ఆఫర్లతో పాటు, వివిధ బ్రాండ్ల టీవీలపై రూ. 20,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. AI ఎనేబుల్డ్ పీసీలపై రూ. 10,000 వరకు బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కూడా ఇది లభిస్తుంది.