కొత్త జీఎస్టీ వ్యవస్థ వల్ల ముఖ్యంగా క్యాన్సర్, ఆస్తమా వంటి వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు చాలా వరకు తగ్గుతాయి. వీటిపై జిఎస్టి 12 శాతం ఉండేది. దాన్ని ఐదు శాతానికి తగ్గించారు. అలాగే గాయాలు తగిలినప్పుడు వాడే డ్రెస్సింగ్ మెటీరియల్ పై పన్నును కూడా 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. టాల్కం పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్, సబ్బులు ఇలా అన్నిటిపైన జీఎస్టీ పన్నులను 18 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు. కాబట్టి వీటి ధరలు త్వరగా తగ్గుతాయి.