Smartphone: ఒకప్పుడు మొబైల్ ఫోన్లు (Mobile) అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ నేడు ఎగుమతి చేసే దేశంగా నిలిచింది. అగ్రదేశం అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. చైనాను వెనక్కి నెట్టి మరీ..
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు భారత ఉత్పత్తులు వినియోగంలో విశేష ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. ఈ పథకం ఫలితంగా భారత్ అనేక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాను వెనక్కునెట్టి, అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
25
మేడ్ ఇన్ ఇండియా విజయం!
2025 రెండో త్రైమాసికంలో భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 240% మేర పెరిగాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో 44% 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్లే కావడం విశేషం. గత ఏడాది ఇదే కాలంలో ఈ శాతం 13% మాత్రమే ఉండగా, ఒక్క ఏడాది కాలంలోనే భారత్ చైనాను వెనక్కు నెట్టింది. ఈ గణాంకాలు మేక్ ఇన్ ఇండియా పథకం విజయంగా చెప్పవచ్చు.
35
అదే సమయంలో చైనాకు ఎదురుదెబ్బ!
2024 రెండో త్రైమాసికంలో చైనా అమెరికాకు 61% స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. కానీ 2025 రెండో త్రైమాసికంలో ఈ ఎగుమతులు 25% తగ్గి, చైనా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. భారత్ మాత్రం 44% వాటాతో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలువడం గర్వకారణం.
2025లో భారతదేశం అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసే దేశంగా అవతరించగా, చైనా ఈ రంగంలో వెనుకబడింది. ఈ మార్పుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
ఒకటి అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం. డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం చైనా పడింది. ఈ యుద్ధంలో చైనా ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరో కారణం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి కేంద్రం పనిచేస్తోంది. ఇప్పుడు ఆపిల్ చైనా కంటే భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టింది
55
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ హాబ్ గా భారత్
ఆపిల్‌తో పాటు శామ్‌సంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌లను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ మార్పుతో స్మార్ట్‌ఫోన్ తయారీ భారత్ కీలక భాగస్వామిగా నిలుస్తోంది. మోటరోలా ఇప్పటికీ తన చైనా ఫ్యాక్టరీల ద్వారా అమెరికాకు ఎక్కువ ఫోన్లను ఎగుమతి చేస్తూనే ఉంది. అయితే, ఇటీవల భారతదేశంలో మోటరోలా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇలా భారత్‌లో తయారుచేసి నేరుగా అమెరికా మార్కెట్‌కి ఎగుమతి చేస్తోంది. ఇక శామ్‌సంగ్ ఇప్పటికే భారత్‌లో తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను పెద్దస్థాయిలో విస్తరించి, గ్లోబల్ ఎగుమతులకు కేంద్రంగా మలుచుకుంటోంది.