ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ బద్దలుకొట్టిన టీవీఎస్ స్కూటర్: 24 గంటల్లో 1,618 కి.మీ. ప్రయాణించింది

Published : May 22, 2025, 06:44 PM IST

టీవీఎస్ కంపెనీ కొత్త స్కూటర్ NTORQ 125 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తక్కువ గంటల్లో వేల కి.మీ. ప్రయాణించి రికార్డ్ బద్దలుకొట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.  

PREV
15
TVS NTORQ 125

వినియోగదారులకు తన కంపెనీ స్కూటర్ల కెపాసిటీ తెలియజేయాలని టీవీఎస్ కంపెనీ ఓ ప్రయోగం చేసింది. ఎక్కువ దూరం ఆగకుండా ప్రయాణించే స్కూటర్ టెస్ట్ పెట్టింది. ఇందులో టీవీఎస్ కంపెనీకి ప్రోడక్ట్ అయిన NTORQ 125 స్కూటర్ ని ఉపయోగించింది. ఈ కార్యక్రమం మే 4న నోయిడాలో నిర్వహించారు. 

25
15 గంటల్లో 1000 కి.మీ. ప్రయాణం

ఈ ప్రయాణంలో NTORQ 125 స్కూటర్ 15 గంటల్లో 1000 కి.మీ. ప్రయాణించింది. 24 గంటల్లో 1618 కి.మీ. ప్రయాణించి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో, లక్నో-అసమ్‌గఢ్ వంటి ఎక్స్‌ప్రెస్ వేలలో ఈ స్కూటర్ ప్రయాణించింది. దీంతో NTORQ 125 స్కూటర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

35
TVS NTORQ 125 ఫీచర్స్ ఇవే..

TVS NTORQ 125లో 125cc, 3-వాల్వ్ CVT-i ఇంజిన్ ఉంది. ఇది 7,000 rpm వద్ద 10 bhp శక్తిని, 5,500 rpm వద్ద 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 98 కి.మీ. కేవలం 8.6 సెకన్లలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుది. LED లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, వాయిస్ అసిస్ట్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

45
ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవిగో..

ఈ స్కూటర్ లో రేస్, స్ట్రీట్ రైడింగ్ అనే మోడ్‌లు ఉన్నాయి. ఇంజిన్ కిల్ స్విచ్, తక్కువ ఇంధన LED, హజార్డ్ లైట్ వంటి ఎక్స్ ట్రా ఫీచర్లు కూడా ఉన్నాయి. 

గ్రౌండ్ క్లియరెన్స్ 155 మి.మీ. ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో హైడ్రాలిక్ డ్యామ్పర్‌లతో కూడిన కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి.

55
అందుబాటులో నాలుగు వేరియంట్లు

ఈ స్కూటర్ ముందు చక్రాలకు 220 మి.మీ. రోటో-పెటల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వెనుక చక్రాలకు 130 మి.మీ. డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. ఈ రైడింగ్ టెస్ట్ కోసం NTORQ Race XP వేరియంట్‌ను ఉపయోగించారు. 

ఈ స్కూటర్ డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, XT వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.96,000 నుండి ప్రారంభమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories