Kia Carens Clavis: 7 సీటర్ కార్లకు పోటీగా కియా కొత్త కారు.. రిలీజ్ ఎప్పుడంటే?

Published : May 22, 2025, 02:44 PM IST

సాధారణంగా 7 సీటర్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వవు. కాని కియా కంపెనీ విడుదల చేయనున్న కొత్త 7 సీటర్ కారు కారెన్స్ క్లావిస్ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. 7 సీటర్ కార్లకు పోటీగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. ఈ కారు రిలీజ్ డేట్, మైలేజ్, ఫీచర్స్ తెలుసుకుందామా?

PREV
15
మే 23న విడుదల

కియా కంపెనీ తన కొత్త 7 సీటర్ల ప్రీమియం ఎంపీవీ మోడల్ అయిన కేరెన్స్ క్లావిస్‌ను మే 23, 2025న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త వాహనం, ప్రస్తుత కేరెన్స్ మోడల్‌కు అప్ డేట్స్ యాడ్ చేసి తయారు చేసింది. 7 సీటర్ కార్లలో కొత్తగా కియా కేరెన్స్ క్లావిస్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లో లభించనుంది.

25
మూడు ఇంజిన్ ఆప్షన్స్

కేరెన్స్ క్లావిస్ మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 PS పవర్, 144 Nm టార్క్) 

1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 PS పవర్, 253 Nm టార్క్) 

1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 PS పవర్, 250 Nm టార్క్)

ఈ ఇంజిన్‌లకు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

35
మైలేజ్ వివరాలు..

టర్బో పెట్రోల్ మాన్యువల్, iMT అయితే 15.95 kmpl ఇస్తుంది. 

టర్బో పెట్రోల్ DCT వేరియంట్ అయితే 16.66 kmpl మైలేజ్ ఇస్తుంది.  

డీజిల్ మాన్యువల్ అయితే 19.54 kmpl ఇస్తుంది.  

డీజిల్ ఆటోమేటిక్ అయితే 17.50 kmpl మైలేజ్ ఇస్తుంది. 

నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్ అయితే 15.34 kmpl మైలేజ్ ఇస్తుంది. 

45
ప్రధాన ఫీచర్లు

కేరెన్స్ క్లావిస్‌లో 18 హై-సేఫ్టీ ఫీచర్ల ప్యాకేజీ, ADAS లెవల్ 2.0, డ్యూయల్ ప్యానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వెన్టిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, 5 USB టైప్-C పోర్టులు, కీ లెస్ ఎంట్రీ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి.

55
ధర ఎంతంటే..

కేరెన్స్ క్లావిస్ ధరలు రూ.10.99 లక్షల నుండి రూ.19.49 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది మారుతి ఎర్టిగా, మారుతి XL6, టయోటా రూమియన్, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి వాహనాలతో పోటీ పడుతుంది. 

కేరెన్స్ క్లావిస్‌ను మే 23, 2025న విడుదల చేయనున్నారు. బుకింగ్‌లు మే 9న ప్రారంభమయ్యాయి. కేవలం రూ.25,000 పే చేసి బుకింగ్ చేసుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories