విలాసవంతమైన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ కలిగిన ఫార్చూనర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మార్కెట్ లో లభిస్తుంది. ఇది 2694 cc, DOHC, డ్యూయల్ VVT-i ఇంజిన్‌తో వస్తుంది. అంతేకాకుండా 166 PS పవర్, 245 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విశాలమైన 7 సీట్లు కలిగిన ఈ కారు కొనాలని చాలా మంది కలలు కంటారు. అందుకే టొయోటా చక్కటి ఈఎంఐ ప్లాన్ తో వినియోగదారుల ముందుకొచ్చింది.
రూ.50,000 ముందస్తు చెల్లింపు
టొయోటా ఫార్చూనర్ బెస్ట్ ఫీచర్స్ కలిగిన SUV. చాలా మంది దీని ధర చూసి కొనేందుకు ముందుకు వచ్చే వారు కాదు. అందుకే టొయోటా సరసమైన ఆర్థిక ప్రణాళికతో వినియోగదారుల ముందుకొచ్చింది. టొయోటా ఫార్చూనర్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ.39.32 లక్షలు.
అయితే కేవలం రూ.50,000 ముందస్తుగా చెల్లించి ఈ కారు ఇంటికి తీసుకెళ్ల వచ్చు. మిగిలిన రూ.38.82 లక్షలకు కారు లోన్ తీసుకోవచ్చు.
10 సంవత్సరాల EMI ప్లాన్
మీరు 10 సంవత్సరాల వరకు లోన్ పెట్టుకుంటే నెలవారీ EMI రూ.47,000 నుండి రూ.49,000 వరకు ఉంటుంది. వడ్డీ రేటును బట్టి ఇది సాధారణంగా 9 % నుండి 10 % వరకు మారుతుంది. EMI లాంగ్ టర్మ్ పెట్టుకోవడం వల్ల బడ్జెట్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఫార్చూనర్ డ్రైవింగ్ లగ్జరీని ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుంది. అయితే లోన్ ఇచ్చే సంస్థల మధ్య నిబంధనలు, షరతులు, వడ్డీ రేట్లు మారవచ్చు.
అధిక EMI లోన్ ఆప్షన్
లోన్‌ను త్వరగా తిరిగి చెల్లించాలనుకునే వారికి 7 సంవత్సరాల (84 నెలలు) వ్యవధి కూడా అందుబాటులో ఉంది. ఇలా చేస్తే EMI నెలకు దాదాపు రూ.62,458 పడుతుంది. మీరు ప్రతి నెలా మంచి ఆదాయం సంపాదిస్తుంటే ఈఎంఐ విధానం సెలక్ట్ చేసుకోవడం బెటర్. ఇది మీకు లాంగ్ టర్మ్ లో వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది.