Bank: బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే ఐటీ నోటీసులు వస్తాయా.. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

Published : Apr 20, 2025, 11:07 AM IST

సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (Savings Bank Account) అనేది మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా, దానిపై వడ్డీని కూడా పొందే మార్గం. కానీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు, దాని నియమాలు ఏమిటో మీకు తెలుసా? ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Bank: బ్యాంక్  అకౌంట్లో డబ్బులుంటే ఐటీ నోటీసులు వస్తాయా.. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే


నేటి డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో, ప్రతి ఒక్కరూ తమ డబ్బును బ్యాంకులో సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ప్రభుత్వాలు పథకాల మొత్తాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి పంపిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే పరిస్థితి వచ్చింది. 

ప్రస్తుత నివేదికల ప్రకారం, భారతదేశంలో దాదాపు 80% మంది బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత జన్ ధన్ యోజన వంటి పథకాలతో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 
 

25

సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (Savings Bank Account) అనేది మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా, దానిపై వడ్డీని కూడా పొందే మార్గం. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ తో పోల్చితే సేవింగ్స్ అకౌంట్ లో తక్కువ వడ్డీ లభిస్తుంది. 

అయితే సేవింగ్స్ అకౌంట్ కి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా.? సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చు.? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

35

సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మీరు ఎంత డబ్బు అయినా ఉంచవచ్చు. మీకు నచ్చినంత డబ్బును మీ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఇందుకు పరిమితి అంటూ ఏం లేదు. 

అయితే, పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసేటప్పుడు మీరు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయితే, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయి. 
 

45

కాబట్టి మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే, మీరు CBDTకి తెలియజేయాలి. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కూడా మీరు స్పష్టం చేయాల్సి ఉంటుది. అంతలోపు అయితే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 

ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే, మీపై చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో, ఆదాయపు పన్ను శాఖ 60% వరకు పన్ను, 25% సర్ఛార్జ్ తో పాటు 4% అమ్మకపు పన్నును కూడా వసూలు చేయవచ్చు. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు. 
 

55

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుకోవడం మంచిది కాదు. ఈ డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ లేదా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. అదే విధంగా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. 

అయితే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకునే వారు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయడం కూడా సురక్షితమైన ఎంపికగా చెప్పొచ్చు. దీని వలన మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, మీరు వడ్డీ రూపంలో మంచి రాబడిని కూడా పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories